Garib Rath Weekly Special : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నంద్యాల మీదుగా పూరీ నుంచి యశ్వంతపూర్‌కు స్పెషల్ ట్రెయిన్

| Edited By: Balu

Jan 15, 2021 | 1:06 PM

కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా.. పూరి నుంచి యశ్వంత్ పూర్ ప్రాంతానికి.. యశ్వంత్ పూర్ నుంచి పూరీ ప్రాంతానికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు..

Garib Rath Weekly Special : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నంద్యాల మీదుగా పూరీ నుంచి యశ్వంతపూర్‌కు స్పెషల్ ట్రెయిన్
Follow us on

Garib Rath Weekly Special : కర్నూలు జిల్లా రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు రైల్వే అధికారులు. ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా.. పూరి నుంచి యశ్వంత్ పూర్ ప్రాంతానికి.. యశ్వంత్ పూర్ నుంచి పూరీ ప్రాంతానికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

రైల్వే అధికారులు కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా గరీబ్ రథ్ ప్రత్యేక రైలు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. యశ్వంత్ పూర్ నుంచి పూరీ ప్రాంతానికి శని, ఆదివారాల్లో ఈ రైలును నడపనున్నారు.

గరీబ్ రథ్ రైలు ( Puri Yesvantpur Garib Rath Weekly Special (02063)) నంద్యాల రైల్వేస్టేషన్​కు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు చేరుకొని 11.05కు యశ్వంత్ పూర్​కు బయల్దేరుతుంది. ఇదే రైలు (Puri Garib Rath runs from Yesvantpur (02064) 17న (ఆదివారం) ఉదయం 7 గంటలకు నంద్యాల చేరుకుని 7.05 పూరి బయల్దేరుతుంది.

గరీబ్ రథ్ రైలు ఈ నెల 15న ( శుక్రవారం) మధ్యాహ్నం 3.15 కు బయల్దేరి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, అనంతపురం, హిందూపురం మీదుగా యశ్వంత్ పూర్​కు ఈ నెల 16న ( శనివారం) రాత్రి చేరుకుంటుంది.

అదే రోజు రాత్రి 10.40 కి యశ్వంత్ పూర్ లో బయల్దేరి నంద్యాలకు 17న (ఆదివారం) ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 7.05 నిమిషాలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజామున 3.55 కి పూరి చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి : 

Coronavirus Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 202 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి..

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు.. సంతాపం తెలిపిన ప్రముఖులు

రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు.. ఇదే చివరిది అంటూ ప్రచారం.. హాజరయ్యేందుకు రైతుల సుముఖత