AP Elections 2024: ఏపీలో మరోసారి నమో జపం!.. కూటమికి మోదీ మంత్రం కలిసొస్తుందా?

|

Mar 17, 2024 | 6:59 PM

ఏపీలో సమర శంఖం పూరించింది విపక్ష కూటమి. కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చాక… తొలిసారి నిర్వహించిన ఉమ్మడి బహిరంగసభలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్‌ ఏపీ వికసిత్‌ భారత్‌ తమ లక్ష్యమన్న నరేంద్ర మోదీ… ఏపీలో 25కు 25 ఎంపీ సీట్లు గెలవాలనీ… గెలవాలన్నారు. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలన్నారు మోదీ.

AP Elections 2024: ఏపీలో మరోసారి నమో జపం!.. కూటమికి మోదీ మంత్రం కలిసొస్తుందా?
Weekend Hour
Follow us on

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జోరుపెంచింది. సీట్ల పంపకాలు పూర్తవడంతో ఇక ఎన్నికల రణక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమైంది. కూటమిలోకి పెద్దన్న బీజేపీ ఎంట్రీ తర్వాత.. చిలకలూరిపేట నుంచి ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ మీటింగ్‌కు ప్రధాని మోదీ సహా, టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ హాజరవడంతో మూడు పార్టీల్లో నయా జోష్‌ వచ్చేసింది.

అసలు ఏపీకి కూటమి అవసరం ఎందుకనే విషయంలో స్పష్టత ఇచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. కూటమి గెలిస్తే రాష్ట్రానికి జరిగే లాభమేంటనే విషయంలోనూ ప్రజలకు క్లారిటీ ఇచ్చేశారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మిత్రపక్షాలకూ దిశానిర్దేశం చేశారు. గెలుపు తంత్రాన్ని ఉపదేశించారు మోదీ. ప్రధాని ఇచ్చిన భరోసాతో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది కూటమి. 2014 ఫలితాలను పక్కా రిపీట్‌ చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది.

ఒకేసారి అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసి… ప్రత్యర్థులకు సవాల్‌ విసిరిన అధికారి వైసీపీ.. కూటమికి ధీటుగా సిద్ధం అంటోంది. 2019 గెలుపును మించి… ఈసారి అఖండ విజయాన్ని సాధిస్తామంటోంది. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా తమ విక్టరీని ఆపలేవంటున్నారు సీఎం జగన్‌.

ఓవైపు కూటమి .. మరోవైపు సింహం సింగిల్‌ అంటూ వైసీపీ… ఎన్నికల కదనరంగంలో కాలుదువ్వుతున్నాయి. రాజకీయంగా సామాజిక సమీకరణలు ఓవైపు.. అభివృద్ధి, సంక్షేమ నినాదాలు మరోవైపు.. మరి, ఏపీ ఓటర్లు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..