Weekend Hour: దండుపాళ్యం వర్సెస్ స్టూవర్ట్‌పురం.. వాలంటీర్‌ వ్యవస్థపై ఆగని రచ్చ..!

|

Aug 13, 2023 | 6:59 PM

వాలంటీర్‌ వ్యవస్థపై ఆగని రచ్చ! అదో దండుపాళ్యం ముఠా అంటున్న పవన్‌...! మీరే స్టూవర్ట్‌పురం దొంగలంటున్న వైసీపీ..! వాలంటీర్లు సహా వైసీపీ నాయకులపై పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి పెద్ద దుమారమే రేపుతున్నాయి. దీనికి అధికారపక్షం నుంచి అదేస్థాయిలో కౌంటర్లు పడుతుండటంతో.. వ్యవహారం కాకపుట్టిస్తోంది.

Weekend Hour: దండుపాళ్యం వర్సెస్ స్టూవర్ట్‌పురం.. వాలంటీర్‌ వ్యవస్థపై ఆగని రచ్చ..!
Weekend Hour With Murali Krishna
Follow us on

Weekend Hour With Murali Krishna: దండుపాళ్యం వర్సెస్‌ స్టూవర్ట్‌పురం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదో కొత్త రచ్చ. వాలంటీర్లు సహా వైసీపీ నాయకులపై పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి పెద్ద దుమారమే రేపుతున్నాయి. దీనికి అధికారపక్షం నుంచి అదేస్థాయిలో కౌంటర్లు పడుతుండటంతో.. వ్యవహారం కాకపుట్టిస్తోంది. ఏపీలో వాలంటీర్లపై మొదలైన పొలిటికల్‌ దుమారం.. పొగలుగక్కుతోంది. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్నారంటూ ఆ మధ్య వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌… మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. అదో దండుపాళ్యం ముఠాలా తయారైందంటూ తీవ్ర ఆరోపణలు చేయడం కొత్త రచ్చకు దారితీసింది.

పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు అధికారపక్షం నుంచి అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. పవన్‌ కల్యాణే స్టూవర్టుపురం దొంగల బ్యాచ్‌లో మెంబరంటూ… స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇచ్చారు మంత్రి అమర్నాథ్‌.

చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ను మించిన దండుపాళ్యం బ్యాచ్‌ మరోటి లేదంటూ… తనదైన స్టయిల్‌లో స్పందించారు మరో మంత్రి అంబటి రాంబాబు. వాళ్లంతా కలిసి ఎవరెంత దోచుకున్నారో అందరికీ తెలుసన్నారు. ఒక్కరు చేసిన తప్పును.. మొత్తం వాలంటీర్‌ వ్యవస్థపై రుద్దడం కరెక్టు కాదన్నారు మంత్రి.

ఇప్పటికే మలివిడత వారాహి యాత్రతో వైసీపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌… ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉడుకు పెంచేశారు. తాజాగా, వాలంటీర్లపై మరోసారి పవన్‌ తీవ్రవ్యాఖ్యలు చేయడం, దానికి అధికారపక్షం తీవ్రంగా స్పందించడం… ఈ హీట్‌ను మరింత పీక్స్‌ తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి ఈ రచ్చ ఏ మలుపు తీసుకుంటుందో మరి.

వీకెండ్ హౌర్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..