AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఘోర ప్రమాదం.. వియ్యంకుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం!

పెళ్లి బాజాలు మోగిన కొద్ది గంటల్లోనే ఆ కుటుంబంలో చావుబాజాలు మోగాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివాహం ముగించుకుని వరుడి స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా, జన్నివలస వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి మట్లా సన్యాసిరావు, పెళ్లికూతురు చిన్నాన్న పైడిరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వరుడి తల్లి, సోదరి పరిస్థితి విషమంగా ఉంది. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్

పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఘోర ప్రమాదం.. వియ్యంకుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం!
Vizianagaram Road Accident
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: May 12, 2026 | 11:58 AM

Share

విజయనగరం జిల్లాలో ఒక శుభకార్యం పెను విషాదంగా మారింది. పెళ్లి వేడుక ముగిసిన ఆనందంలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన కుటుంబ సభ్యులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. టిప్పర్ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జామి మండలం అన్నంరాజుపేటకు చెందిన మట్లా సన్యాసిరావు (48) తన చిన్న కుమారుడికి పాచిపెంట మండలం తోటవలసకు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. శనివారం రాత్రి వధువు ఇంటి వద్ద వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పెళ్లి తంతు ముగిశాక, కొత్త జంట కారులో బయలుదేరగా.. వరుడి తండ్రి సన్యాసిరావు, తల్లి కనకమ్మ, సోదరి మంగమ్మ, వధువు చిన్నాన్న లావేరు పైడిరాజు (55) మరో ఇద్దరితో కలిసి ఆటోలో అన్నంరాజుపేటకు ప్రయాణమయ్యారు.

వీరి ఆటో జన్నివలస సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి చేరుకోగానే, రాంగ్ రూట్‌లో వేగంగా వస్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. టిప్పర్ టైరు పేలడంతోనే డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వరుడి తండ్రి సన్యాసిరావు, వధువు చిన్నాన్న పైడిరాజు మరణించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుడి తల్లి కనకమ్మ, చెల్లి మంగమ్మ ప్రస్తుతం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఒకే ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు చిన్నాన్న మృతి చెందడంతో అన్నంరాజుపేట, చాకలిపేట గ్రామాల్లో నిశ్శబ్దం ఆవరించింది. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వధూవరులు ఈ వార్త విని షాక్‌కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పుగా వస్తున్న వాహనాలు ఎంతటి ప్రాణనష్టాన్ని కలిగిస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!