Ap Weather: ‘జవాద్‌’ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

|

Nov 18, 2021 | 8:46 AM

జవాద్‌ సెక్లోన్‌ ముప్పు పొంచే ఉందా ..? ఏపీలోని ఏ ప్రాంతంపై సైక్లోన్ ఎఫెక్ట్ పడనుంది ..? ఇంకా ఎన్ని రోజుల వరకు వెదర్ రిపోర్ట్ ఇలా వణికిస్తుంది ?

Ap Weather: జవాద్‌ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
AP Telangana Rains
Follow us on

పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇటీవల భారీ వర్షాలు సృష్టిస్తున్న బీభత్సం చూస్తుంటే ఏపీకి అలాంటి గండం పొంచి ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా అండమాన్‌ నికోబార్‌ తీరం దగ్గర ఏర్పడ్డ వాయుగుండం ఇవాళ, రేపట్లో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉంది. ఇది కోస్తాంధ్ర- తమిళనాడు తీరానికి చేరుకునే సమయానికి మరింత పలబడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం కాస్తా తుఫానుగా మారితే క్రమంగా బలపడి ఈ నెల18 నాటికి తీరానికి చేరే అవకాశం ఉంది. జవాద్‌ తుఫాను ఎఫెక్ట్‌తో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుంది. ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

వాయుగుండం తీరం దాటే వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దంటూ అలర్ట్ చేసింది విపత్తు నిర్వాహణశాఖ. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. సైక్లోన్ ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Also Read: నవంబర్ 21 వరకు విద్యాసంస్థలు మూసివేయండి.. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశం..