AP Weather: అబ్బబ్బా.. ఏపీని వీడని వానలు.. మరో అల్పపీడన ముప్పు.. ఆ జిల్లాలకు వర్షసూచన

|

Nov 30, 2022 | 2:50 PM

4 లేదా 5 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. 6, 7 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

AP Weather: అబ్బబ్బా.. ఏపీని వీడని వానలు.. మరో అల్పపీడన ముప్పు.. ఆ జిల్లాలకు వర్షసూచన
Andhra Pradesh Weather Update
Follow us on

ఏపీకి మరో రెయిన్ అలెర్ట్ వచ్చింది. డిసెంబర్ 4 లేదా 5వ తేదీల్లో అండమాన్‌ సముద్రం అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అది  పశ్చిమ వాయువ్యంగా పయనించి.. స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వివరించారు. దీంతో దక్షిణ కోస్తాలో డిసెంబరు 6, 7 తేదీల్లో రెయిన్స్ పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకాశం,  నెల్లూరు, తిరుపతి, జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.  ఇక ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయీల లో తూర్పు / ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :

ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఈ రోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:-తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం