AP Weather: ఏపీకి బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే చాన్స్

|

Jun 10, 2024 | 6:29 PM

ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే చాన్స్ ఉందని.. వర్షం పడేటప్పుడు బయట ఉండొద్దని అధికారులు సూచించారు. తాజా వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

AP Weather: ఏపీకి బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే చాన్స్
Weather Report
Follow us on

మరఠ్వాడా ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.దీని ప్రభావంతో జూన్ 11, మంగళవారం అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారం నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.