AP Weather Alert: ఏపీకి వాతావరణ సూచన.. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

|

Jan 28, 2022 | 2:36 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. శీతాకాలం(Winter Season) లో ఓ వైపు మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువున నమోదవుతున్నాయి..

AP Weather Alert: ఏపీకి వాతావరణ సూచన.. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
Ap Weather Alert
Follow us on

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. శీతాకాలం(Winter Season) లో ఓ వైపు మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువున నమోదవుతున్నాయి. అయితే మరోవైపు జనవరి నెలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని తాజా వాతావరణ పరిస్థితిపై రాగల మూడు రోజుల్లో ఎలా ఉండనుందో అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయని.. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉండనుందో తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు , రేపు , ఎల్లుండి మూడు రోజులు వాతావరణం పొడి గా ఉండ వచ్చు.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండ వచ్చు.
రాయలసీమ: ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు, ఎల్లుండి వాతావరణం పొడి గా ఉంటుంది.

Also Read:

నేను 129 మంది పిల్లలకు తండ్రి అయ్యా.. 150 మంది పిల్లలకు తండ్రి కావడమే ధ్యేయమంటున్న ఓ వ్యక్తి..