Cold claw on Telugu States: తెలుగురాష్ట్రాలను వణికిస్తున్న చలి.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

|

Dec 19, 2021 | 12:07 PM

AP and Telangana Cold wave: తెలుగురాష్ట్రాలను వణికిస్తుంది చలి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్యం నుంచి చలిగాలులు వేగంగా వీస్తున్నాయి. దీంతో వచ్చే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్న ట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Cold claw on Telugu States: తెలుగురాష్ట్రాలను వణికిస్తున్న చలి.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Cold Weather
Follow us on

Lowest Temperature: తెలుగురాష్ట్రాలను వణికిస్తుంది చలి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్యం నుంచి చలిగాలులు వేగంగా వీస్తున్నాయి. దీంతో వచ్చే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్న ట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక హైదరాబాద్‌లో నిన్న దశాబ్దంలోనే డిసెంబర్‌ నెలలో అత్యంత చలిరోజుగా రికార్డయింది. సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉదయం అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్‌ 13న హైదరాబాద్‌లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయాయి. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కి.మీ. ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలి తీవ్రత పెరిగినట్టు వాతావరణ శాఖాధికారులు చెప్పారు. దీంతో రానున్న వారం రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని, 15 రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. విశాఖ మన్యంలో వారం రోజులుగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Read Also…  Case on PT Usha: పరుగుల రాణి పిటి ఉషపై కేసు నమోదు చేసిన కోజికోడ్ పోలీసులు.. ఎందుకోసమంటే..?