Weather Alert AP & TS: భానుడి భగభగల నుంచి ఉపశమనం.. తెలుగురాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం..

|

May 22, 2023 | 7:12 AM

పశ్చిమ బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని చెప్పింది.

Weather Alert AP & TS: భానుడి భగభగల నుంచి ఉపశమనం.. తెలుగురాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం..
Andhra Pradesh Rains
Follow us on

భానుడి భగ భగలు కొనసాగుతుండగానే.. రెయిన్‌ అలర్ట్‌ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. బిహార్‌ నుంచి చత్తీసఘడ్‌ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణితో ఇవాళ, రేపు వర్ష గండం పొంచి ఉంది. ఇక.. ఏపీలోనూ మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు.. పిడుగులు పడే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణం కాస్తా చల్లబడనుంది.

పశ్చిమ బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని చెప్పింది. ఇవాళ రేపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వివరించింది. హైదరాబాద్‌ పరిసరాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39–42 డిగ్రీల వరకు నమోదు కానున్నట్లు అంచనా వేసింది.

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు..

ఇవి కూడా చదవండి

ద్రోణి విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు.. 

రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి కేంద్రం తెలిపింది. పగటిపూట మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో ఉద్ధృతంగా పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. కొన్ని చోట్ల గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పొలాల్లో పనిచేసే రైతులు.. గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఆదేశించారు. సురక్షితమైన భవనాల్లో ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాతాల్లో ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. కొత్తూరు మండలంలో కుంటిబద్రలో పిడుగు పడి కొబ్బరి చెట్టు దద్ధమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..