Weather: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు.. రానున్న 3 రోజులపాటు దంచికొట్టనున్న వానలు

మార్చిలోనే మండుతున్న ఎండలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రానున్న మూడ్రోజుల పాటు వానలు కురుస్తాయని తెలిపింది.

Weather: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు.. రానున్న 3 రోజులపాటు దంచికొట్టనున్న వానలు
Rains

Edited By: Anil kumar poka

Updated on: Mar 21, 2022 | 12:54 PM

ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా నిత్యం పెరుగుతున్న ఉష్ణొగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మే నెలలో నమోదు కావాల్సిన గరిష్ఠ ఉష్ణొగ్రతలు మార్చిలోనే నమోదవుతుండడంతో ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఏపీ(Ap), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా వీస్తున్న వేడిగాలులకు ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితిని ఊహించుకుని బెంబేలెత్తిపోతున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు ఎండవేడిమితో బాధపడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడ్రోజులపాటు వానలు దంచికొడతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్‌(hyderabad) సహా పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, సికింద్రాబాద్‌, చిలకలగూడ, బేగంపేట, మారేడ్‌పల్లిలో తేలికపాటి వర్షం కురిసింది. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం దొరికిందని ఆనందపడుతున్నారు. అటు ఏపీలోనూ నైరుతి గాలుల ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయిని ప్రకటించింది వాతావరణశాఖ. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోందని తెలిపింది. రానున్న 24 గంటల్లో తీవ్రవాయుగుండం మారి, ఆ తర్వాత 36 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లోనూ వాతావరణం చల్లబడడమే కాకుండా..చిరుజల్లులు కురవడంతో జనాలు కాస్త రిలాక్స్‌డ్‌గా ఫీలవుతున్నారు.

Also Read: బార్డర్ వద్ద అనుమానాస్పదంగా డ్రైవర్.. ట్రక్ లోపల చెక్ చేసి కంగుతిన్న అధికారులు

 అక్కడ కేజీ చికెన్ 1000.. ఒక్కో గుడ్డు 35 రూపాయలు.. కిలో ఉల్లిపాయలు 250