తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు సృష్టించామని టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులకు తమ 59 నెలల పాలనలో వచ్చిన పెట్టుబడులను ఆయన వివరించారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలలో స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ప్రైవేటు పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో లక్షా 35వేల మంది పనిచేస్తున్నారని జగన్ తెలిపారు. వైద్యరంగంలో 54వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఎంఎస్‌ఎంఈలపై మేం పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదన్నారు. ఎంఎస్‌ఎంఈల్లో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి దొరికిందని సీఎం జగన్ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…