
ఒక్క పాకిస్థాన్ కాదు.. వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేవని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఈ సభలో లోకేష్ మాట్లాడుతూ.. భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉందన్నారు. భారత్ గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి