పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం.. సాగర్ నుంచి నీటి విడుదల..

నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. డ్యాం నుంచి కుడి కాలువకు ఒంగోలు చీఫ్ ఇంజినీర్ అధ్వర్యంలో మోటార్లకు సెపరేట్‌గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. అధికారులు గేట్లు ఎత్తారు. 5వ గేట్ నుంచి 2 వేల క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేశారు.

పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..  సాగర్ నుంచి నీటి విడుదల..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 30, 2023 | 12:44 PM

నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. డ్యాం నుంచి కుడి కాలువకు ఒంగోలు చీఫ్ ఇంజినీర్ అధ్వర్యంలో మోటార్లకు సెపరేట్‌గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. అధికారులు గేట్లు ఎత్తారు. 5వ గేట్ నుంచి 2 వేల క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. ఇవాళ తెల్లారుజాము నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పై ఊహించని హైడ్రామా కొనసాగుతోంది. రాత్రికిరాత్రి ప్రాజెక్ట్‌పై పెద్దఎత్తున బలగాలను మోహరించింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రా భూభాగంలో ఉన్న గేట్లను కంట్రోల్‌లోకి తీసుకుంది. సాగర్‌లో మొత్తం 26 గేట్లు ఉంటే… 13 గేట్లను స్వాధీనం చేసుకుంది. పోలింగ్‌ మొదలవడానికి కొద్దిగంటల ముందు ఇది జరగడంతో ప్రాజెక్ట్‌పై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ఏపీ చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ పోలీసులు. 13వ గేటు దగ్గర ఏపీ పోలీసులు పెట్టిన బారికేడ్లు, ముళ్ల కంచెలను తొలగించాలని కోరారు. అయితే, 13 గేట్లు తమ పరిధిలోకి వస్తాయంటోంది ఏపీ ప్రభుత్వం. బారికేడ్లు తొలగించడానికి ఏపీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్ట్‌పై హైడ్రామా కొనసాగింది. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాల ప్రకారం సాగర్ నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. నీటి విడుదల, భద్రతా విషయంలో ఇప్పటివరకూ ఇదే కొనసాగింది. ఇప్పుడు ఏపీ అధికారులు తమ పరిధిలోకి వచ్చే 13 గేట్లు స్వాధీనం చేసుకుంటూ డ్యామ్‌ మధ్యలో ముళ్లకంచె వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.