తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. శ్రీశైలం డ్యాంకి భారీగా వరద నీరు.. రేపు గంగమ్మకు పూజ చేసి గేట్లు ఎత్తనున్న మంత్రి నిమ్మల

| Edited By: Surya Kala

Jul 29, 2024 | 9:23 AM

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 కాగా ప్రస్తుతం 876.70 అడుగులుగా ఉంది. అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 కాగా ప్రస్తుతం 171.8625 గా ఉంది. మరోపక్క ఇప్పటికే కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సుమారు 62,857 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి వినియోగానికి ఉపయోగిస్తూ.. దిగువకు నీటిని ఔట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ రోజు రాత్రికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుంది.

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. శ్రీశైలం డ్యాంకి భారీగా వరద నీరు.. రేపు గంగమ్మకు పూజ చేసి గేట్లు ఎత్తనున్న మంత్రి నిమ్మల
Srisailam Project
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుకుంటుంది. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో రేపు శ్రీశైల జలాశయం రేడియల్ కాస్ట్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారి నిర్ణయించారు. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అధికారులు సుమారు 5 లేదా 6 రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. దీని కోసం నీటిపారుదలశాఖ అధికారులు ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుండి 4,36,433 క్యూసెక్కులు నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది.

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 కాగా ప్రస్తుతం 876.70 అడుగులుగా ఉంది. అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 కాగా ప్రస్తుతం 171.8625 గా ఉంది. మరోపక్క ఇప్పటికే కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సుమారు 62,857 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి వినియోగానికి ఉపయోగిస్తూ.. దిగువకు నీటిని ఔట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ రోజు రాత్రికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుంది. దీనితో రేపు ఉదయం జలాశయం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి గంగా హరతి సమర్పించి అనంతరం ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అధికారులు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..