Anantapur: బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి ఎంటరయిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి
కల్యాణదుర్గంలో భల్లూకం బెంబేలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి ప్రవేశించింది. మనుషులు ఎదురుపడినప్పుడు ఇవి షాక్‌కు గురయ్యి, ఆ తర్వాత తమను తాము కాపాడుకొనే క్రమంలో దాడులు చేస్తాయి.. అందుకే భల్లూకం సంచరించే ప్రాంతాల్లో జనాలు అలెర్ట్‌గా ఉండాలి.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఓ ఎలుగుబంటి జనావాసాల్లోకి చొరబడింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దొడగట్టరోడ్ మార్కెడ్ యార్డ్ ఎదురుగా ఉన్న బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి ప్రవేశించింది భల్లూకం. 15 నిమిషాలపాటు సంచరించిన ఎలుగుబంటి..చివరకు తలుపులు పగులగొట్టి బిస్కెట్ బాక్సులు చింపివేసింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ ప్రాంతంలో నిత్యం ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్టు సిబ్బంది చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 29, 2024 09:23 AM
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

