RK Roja: మారుమూల గ్రామంలో మంత్రి రోజా పల్లె నిద్ర.. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ..

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రతి రోజూ ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు. రాత్రి అక్కడే బస చేసి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. నగరి నియోజక వర్గంలోని గ్రామ గ్రామాన మంత్రి ఆర్కే రోజా పల్లెనిద్ర చేస్తూ గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  వడమాలపేట మండలం అప్పలాయగుంట ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

RK Roja: మారుమూల గ్రామంలో మంత్రి రోజా పల్లె నిద్ర.. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ..
Watch Video Of Ap Tourism Minister Rk Roja Participating In The Village Sleep, Palle Nidra Program

Edited By:

Updated on: Nov 15, 2023 | 12:41 PM

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రతి రోజూ ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు. రాత్రి అక్కడే బస చేసి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. నగరి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన రోజా పల్లెనిద్ర చేస్తూ గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  వడమాలపేట మండలం అప్పలాయగుంట ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండ్రోజుల క్రితం ఈ గ్రామంలో బస చేసిన అక్కడి గ్రామస్థుల సమస్యలపై ఆరా తీశారు. నిన్న పుత్తూరు మండలం గుండ్రాజుకుప్పం ఎస్సీ కాలనీలో మంత్రి ఆర్కే రోజా పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో భాగంగా గుండ్రాజుకుప్పం ఎస్సీ కాలనీలో బసచేసిన మంత్రి రోజా అక్కడి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం దిశగా అడుగులు వేస్తున్నారు.  స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పల్లెనిద్ర చేసి ఉదయం స్థానిక వైసీపీ కేడర్‌తో పాటు గ్రామ ప్రజలతో మమేకమై గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి క్యాడర్‌లో జోష్ నింపారు. గ్రామంలోని మహిళతో సెల్ఫీలు తీసుకుని సరదాగా గడిపారు. నాలుగున్నర ఏళ్ల సంక్షేమ పాలన, జగన్ తిరిగి రాష్ట్రానికి సీఎం ఎందుకు కావాలో వివరిస్తూ ఈ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి ఆర్కే రోజా.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..