Watch Video: మచిలీపట్నం మత్స్యకారుల వలకు చిక్కిన బాహుబలి చేప.. వామ్మో.. వీడియో చూస్తే షేకవ్వాల్సిందే..

|

Jul 28, 2024 | 6:08 PM

మచిలీపట్నం మత్స్యకారుల పంట పండింది. సముద్ర గర్భంలోంచి బయటకొచ్చిన టన్నున్నరకు పైగా బరువుండే భారీ బాహుబలి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ బాహుబలి చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తంచేశారు.

Watch Video: మచిలీపట్నం మత్స్యకారుల వలకు చిక్కిన బాహుబలి చేప.. వామ్మో.. వీడియో చూస్తే షేకవ్వాల్సిందే..
Big Fish
Follow us on

మచిలీపట్నం మత్స్యకారుల పంట పండింది. సముద్ర గర్భంలోంచి బయటకొచ్చిన టన్నున్నరకు పైగా బరువుండే బాహుబలి టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ టేకు చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తంచేశారు. ఈ భారీ చేప మచిలీపట్నంలో గిలకలదిండి మత్స్యకారుల వలకు చిక్కిందని స్థానికులు తెలిపారు. మొదట చేపల కోసం వల వేశారు. తరువాత.. చేపలు పడ్డాయని భావించి తమవైపు లాగారు.. ఈ క్రమంలో ఎంతకీ రాకపోవడంతో చాలా సేపు ప్రయత్నించారు.. ఆ తరువాత ఈ చేపను చూసి మత్స్యకారులంతా ఒక్కసారిగా షాకయ్యారు. దాన్ని నీళ్లల్లోంచి ఒడ్డుకి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో క్రేన్‌ తీసుకొచ్చారు. క్రేన్ సాయంతో టేకు చేపను బయటకు తీసుకొచ్చారు. అయితే.. ఈ భారీ బాహుబలి చేపను చూసేందుకు జనం ఆసక్తి చూపారు. ఈ టేకు చేపలు అత్యంత అరుదుగా దొరుకుతాయని మత్స్యకారులు తెలిపారు.

వీడియో చూడండి..

 

మూడు రోజుల క్రితం మత్స్యకారులు వేటకి వెళ్ళగా.. వారి వలకు చిక్కింది.. దీంతో చేపను అతి కష్టం మీద తీరానికి చేర్చారు. తీరానికి వచ్చిన తర్వాత క్రేన్ సహాయంతో టన్నున్నర టేకు చేపను ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆయుర్వేద మందులు తయారీకి ఉపయోగపడే ఈ టేకు చేపను.. చెన్నైకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారని మత్స్యకారులు తెలిపారు.

ఇది దాదాపు 1500 కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.. ఇవి వలకు అరుదుగా చిక్కుతాయని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..