Watch Video: స్కూల్లో పాఠాలు వింటూనే కుప్పకూలిన పదో తరగతి బాలిక.. క్షణాల్లోనే మృతి! వీడియో వైరల్

పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు టీచర్లు కూడా సిలబస్‌ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఉదయం పూట విద్యార్ధులందరూ క్లాస్‌లో కూర్చుని టీచర్ పాఠాలు వింటుండగా.. ఓ బాలిక ఉన్నట్లుండి స్పృహ తప్పి..

Watch Video: స్కూల్లో పాఠాలు వింటూనే కుప్పకూలిన పదో తరగతి బాలిక.. క్షణాల్లోనే మృతి! వీడియో వైరల్
10th Class Girl Student Died Of A Heart Stroke In Shool

Updated on: Dec 13, 2025 | 5:14 PM

రామచంద్రపురం, డిసెంబర్‌ 13: పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు టీచర్లు కూడా సిలబస్‌ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఉదయం పూట విద్యార్ధులందరూ క్లాస్‌లో కూర్చుని టీచర్ పాఠాలు వింటుండగా.. ఓ బాలిక ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శనివారం (డిసెంబర్ 13) ఈ దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి (14) స్థానికంగా ఉన్న రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఉదయం పూట స్కూల్లో పాఠాలు వింటుండగానే ఉన్నట్లుండి సృహ తప్పి పడిపోయింది. దీంతో స్కూల్ యాజమన్యం హుటా హుటిన బాలికను ఏరియా ఆసుపత్రి కి తరలించారు.అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. స్ట్రోక్ రావడంతో చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. దీనిపై రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.