Vontimitta Temple: ఇక ఒంటిమిట్ట ఆలయం దశ తిరిగినట్టే.. అభివృద్ధికి TTD మాస్టర్ ప్లాన్

అన్నమయ్య జిల్లాలో పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి టీటీడీ కసరత్తు చేస్తోంది. వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించబోతోంది. ఇందులో భాగంగానే టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతిలో అధికారులతో సమీక్ష చేపట్టారు. టిటిడి పరిపాలనా భవనంలో తన ఛాంబర్ లో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

Vontimitta Temple: ఇక ఒంటిమిట్ట ఆలయం దశ తిరిగినట్టే.. అభివృద్ధికి TTD మాస్టర్ ప్లాన్
Ttd

Edited By: Anand T

Updated on: Dec 06, 2025 | 12:31 PM

అన్నమయ్య జిల్లాలో పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి టీటీడీ కసరత్తు చేస్తోంది. వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించబోతోంది.ఇందులో భాగంగానే తాజాగా టీటీడీ ఈవో అధికారులతో సమావేశం నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల నాటికి భక్తులు రోజుకు ఎంత మంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి.. భక్తులకు సరిపడేలా మౌళిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మికత, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని ఇంజనీరింగ్ శాఖ కు ఆదేశించారు.

అదే విదంగా భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామ స్వామి ప్రాశస్థ్యం నవతరానికి అందించేలా మ్యూజియమ్, ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవా నిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాం, నాలుగు మాడ వీధుల అభివృద్ధి, సిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలన్నారు.

మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టిటిడి విజిలెన్స్, అటవీశాఖ, అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేసి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డా. అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. సమీక్షలో టిటిడి సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈ-1 మనోహరం ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.