Vijayasaireddy: అశోక్ గజపతి రాజుపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి.. ఏకంగా వంశ చరిత్రను తిరగతోడుతూ..
Vijayasaireddy: మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై ట్విట్టర్ వేదికగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి..
Vijayasaireddy: మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై ట్విట్టర్ వేదికగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక అని.. ఫ్రెంచ్, బ్రిటీష్ సేనలను, పొరుగు రాజ్యం కుట్రలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. విజయరామ గజపతిలా వారు విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదంటూ అశోక్ గజపతి రాజు ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ రామ గజపతి.. హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచం ఇచ్చి బొబ్బిలి కోట పై దొంగదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఒక ఫోటో క్లిప్‌ను ట్విట్టర్లో జత చేశారు విజయసాయి రెడ్డి. తండ్రి పీవీజీ రాజులా కాకుండా విజయరామ గజపతిలా మారి అశోక్ గజపతి.. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఇది 18వ శతాబ్దం కాదని, నీ ఆటలు ఇక సాగవు అంటూ అశోక గజపతిరాజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గజపతులంటే ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడని మోతుబరి జమిందారులు అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.
గోల్కొండ సుల్తానులకు, నిజాం నవాబులకు బానిసలని ఫైర్ అయ్యారు. ఫ్రెంచ్ సైన్యాధిపతి బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బతీశారని అన్నారు. అలాంటి గజపతులు ప్రజలను పీడించి, బ్రిటీష్ వారికి కప్పం కట్టేవారంటూ ఫైర్ అయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిషర్లతో కలిసి ప్రజలను గజపతులు హింసించారని తీవ్రమైన కామెంట్స్ చేశారు. పీవీజీ, ఆనంద గజపతిని కాదని పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నావా అశోక్? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘కప్పు చంద్రబాబుకు కడుతున్నవా? పప్పు నాయుడికి కడుతున్నవా? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడవడంలో మీ పూర్వీకులే మీకు స్ఫూర్తా?’ అని ట్విట్టర్ వేదికగా పరుష వ్యాఖ్యలతో ఫైర్ అయ్యారు విజయాసాయి రెడ్డి.
Vijayasai Reddy Tweets:
తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక. ఫ్రెంచ్, బ్రిటిష్ వారితోపాటు పొరుగు రాజ్యం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించారు గానీ విజయరామ గజపతిలా విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదు వారు. (1/4) pic.twitter.com/1yUK4K9s47
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 25, 2021
హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచమిచ్చి బొబ్బిలి కోటపై దొంగదెబ్బ కొట్టాడు విజయరామ గజపతి. తండ్రి పీవీజీ రాజులా కాకుండా ముత్తాత విజయరామలా మారాడు అశోక్. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడు. కానీ నీ ఆటలు సాగవు అశోక్ . ఇది18వ శతాబ్దం కాదు. (2/4) pic.twitter.com/1Zumou9j4B
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 25, 2021
గజపతులంటే ప్రజల పక్షాన ఎన్నడూ నిలబడని మోతుబరి జమిందారులు. గోల్కొండ సుల్తానులు, తర్వాత నిజాం నవాబులకు బానిసలు. ఫ్రెంచ్ జనరల్ బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బ తీశారు. ప్రజలను పీడించి బ్రిటిష్ వారికి కప్పం కట్టేవారీ గజపతులు. (3/4)
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 25, 2021
స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ తో కలిసి ప్రజలను హింసించారు గజపతులు. పీవీజీ, ఆనంద గజపతిని కాదని పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నావా అశోక్? కప్పం చంద్రబాబుకు కడుతున్నావా…పప్పు నాయుడుకా? ఎన్టీఆర్ కు వెన్నుపోటుకు మీ పూర్వీకులే స్ఫూర్తా? (4/4)
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 25, 2021
ALso read: