AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్.. చివరికి..!

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న లోడ్ లారీ, టిప్పర్ బలంగా ఢీకొనడంతో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్, క్లీనర్ కేబిన్‌లో చిక్కుకుపోవడంతో, పోలీసులు, సహాయక బృందాలు నాలుగు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘోర ప్రమాదం..  టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్.. చివరికి..!
Vizianagaram Road Accident
Balaraju Goud
|

Updated on: Sep 22, 2026 | 7:37 AM

Share

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం కోమటపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లోడ్ లారీ, టిప్పర్ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు టిప్పర్ కేబిన్‌లో డ్రైవర్, క్లీనర్ చిక్కుకుపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ప్రమాదం ధాటికి టిప్పర్ కేబిన్ నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకున్న వారు బయటకు రాలేక ఆర్తనాదాలు చేశారు. తమను కాపాడాలంటూ బాధితులు చేసిన కేకలతో ఘటనాస్థలిలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కేబిన్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రత్యేక పరికరాలతో సుమారు నాలుగు గంటల పాటు సహాయక చర్యలు కొనసాగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని బయటకు తీసిన అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?