Vizag: పుట్ట నుంచి చీమలు వచ్చినట్లుగా బయటకు వస్తోన్న జిగేల్‌ రాణి బాధితులు

విశాఖ హనీట్రాప్ కేసులో షాకింగ్‌ విషయాలు బయటకొస్తున్నాయి. రండి బాబు రండి అన్నట్లుగా బయటకొస్తున్నారు జిగేల్‌ రాణి బాధితులు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Vizag: పుట్ట నుంచి చీమలు వచ్చినట్లుగా బయటకు వస్తోన్న జిగేల్‌ రాణి బాధితులు
Vizag Honey Trap Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2024 | 9:32 PM

పేరు జాయ్‌ జెమిమా. వయసు 27ఏళ్లు. అందమే పెట్టుబడి.. సంపన్న వర్గాలే టార్గెట్‌.. ముగ్గులోకి దింపడానికో స్కెచ్చు. ఉన్నదంతా ఊడ్చేసి పరారవడమే బిజినెస్ ట్రిక్. మొన్న విశాఖలో బైటపడ్డ ఈ హానీ ట్రాప్‌ దందా.. స్థానికులని బెంబేలెత్తిస్తోంది. అంతేకాదు మేము ఆ జెమియా బాధితులమేనంటూ పలువురు స్టేషన్‌కు క్యూ కడుతుండటం పోలీసులను షాక్‌కు గురిచేస్తోంది. ఆ కిలాడీ అరెస్ట్‌ కావడంతోనే… బాధితులు బయటకొస్తున్నారు.

ఇక కేసును ఫుల్‌ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు… ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగానే ఈ హనీట్రాప్‌ ముఠా నెట్‌వర్క్‌ నడిపిస్తున్నట్లు గుర్తించారు. డిజిటల్‌ మార్కెటింగ్ చేస్తున్నానంటూ డబ్బున్న యువకులను పరిచయం చేసుకుని ట్రాప్‌ చేస్తున్నట్లు తెలిపారు. మాయలేడీ వేధింపులు తట్టుకోలేక ఒడిశా పారిపోయానంటూ ఓ బాధితుడు ఆశ్రయించడంతో పోలీసులే బిత్తరపోతున్నారు. బెదిరించిన ప్రతీసారి లక్షల్లో సమర్పించుకున్నానని చెప్పడంతో… ఆమె ఆన్‌లైన్ లావాదేవీల‌పై నిఘా పెట్టారు. న‌గ‌దు లావాదేవీల‌పైనా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని పలువురు యువకులను కూడా ట్రాప్‌‌‌‌ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులకు విశాఖ సీపీ బాగ్చి సమాచారం అందించారు. నిందితురాలి బ్యాంకు ఖాతాల్లోని క్యాష్‌‌‌‌ను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.

మొత్తంగా… ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టమంటున్నారు పోలీసులు. బాధితులను నుంచి ఎద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని.. మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

మెటర్నిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఈ ప్లాన్‌ వల్ల ప్రయోజనాలు ఏంటి?
మెటర్నిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఈ ప్లాన్‌ వల్ల ప్రయోజనాలు ఏంటి?
ఇదెక్కడి విడ్డూరం.. టూత్ బ్రష్‌ను అమాంతంగా మింగేసిన మహిళ ఏమైందంటే
ఇదెక్కడి విడ్డూరం.. టూత్ బ్రష్‌ను అమాంతంగా మింగేసిన మహిళ ఏమైందంటే
రాజ్, కావ్యలను కలిపేందుకు పెద్దాయన పందెం.. ఇరుక్కున్న కళావతి!
రాజ్, కావ్యలను కలిపేందుకు పెద్దాయన పందెం.. ఇరుక్కున్న కళావతి!
4వ తరగతి విద్యార్థిని వదలని ఉపాధ్యాయుడు!
4వ తరగతి విద్యార్థిని వదలని ఉపాధ్యాయుడు!
కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ అరెస్ట్
కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ అరెస్ట్
మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో.. ఆ సొగసు చూడతరా..! ఇదిగో వీడియో
మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో.. ఆ సొగసు చూడతరా..! ఇదిగో వీడియో
ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్..
ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్..
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..
జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..