Vizag: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా వైజాగ్.. ప్రకృతి రమణీయతకు నెలవు.. ఇంకా ఎన్నో స్పెషాలిటీస్

|

Oct 06, 2021 | 9:21 PM

కావాల్సినన్ని ఆలయాలు వైజాగ్‌లో ఉన్నాయ్. సింహాచలం, కైలాసగిరి... ఇవన్నీ సముద్ర మట్టానికి ఎన్నో అడుగుల ఎత్తులో అద్భుతంగా ఉంటాయ్. కైలాసగిరి నుంచి విశాఖను చూస్తే నింగీనేలా కలుసుకున్నాయేమో అనిపిస్తుంది.

Vizag: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా వైజాగ్.. ప్రకృతి రమణీయతకు నెలవు.. ఇంకా ఎన్నో స్పెషాలిటీస్
Vizag
Follow us on

హాలీవుడ్‌కి లాస్ ఏంజెల్స్‌లా …ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వైజాగ్ కేంద్రంగా మారబోతోందా? అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. ముంబై, చెన్నై, హైదరాబాద్‌కి దీటుగా వైజాగ్‌ ఎదుగుతోందని చెబుతున్నారు. అందమైన లొకేషన్స్… ప్రకృతి సోయగాలు… ఎత్తైన కొండలు… ఎటుచూసినా కనిపించే పచ్చదనం… ఆకర్షణీయమైన ఎర్రమట్టి దిబ్బలు… సుదీర్ఘమైన సముద్ర తీరం… బీచ్‌లు… ఉద్యానవనాలు… ఆలయాలు… మధ్యలో అద్భుత నగరం… సినిమా షూటింగ్స్‌కు ఇంతకంటే ఇంకేం కావాలి? ఇవే ఇప్పుడు వైజాగ్‌ను షూటింగ్స్‌కి కేరాఫ్‌గా మార్చేస్తోంది.

క్రైమ్, మాఫియా, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ, రూరల్… ఇలా ఏ బ్యాగ్రౌండ్ మూవీకైనా సరిపోయే లొకేషన్స్ వైజాగ్‌లో ఉన్నాయ్. ఫర్ ఎగ్జాపుల్, ఫైట్ సీన్లకు పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌, పూర్ణా మార్కెట్‌ లాంటివి ఎన్నో ఉన్నాయ్. ఇక, బీచ్‌లకైతే కొదువే లేదు. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, యారాడ బీచ్, భీమునిపట్నం బీచ్… ఇలా ఎన్నో అందమైన బీచ్‌లు వైజాగ్ సొంతం.

కావాల్సినన్ని ఆలయాలు వైజాగ్‌లో ఉన్నాయ్. సింహాచలం, కైలాసగిరి… ఇవన్నీ సముద్ర మట్టానికి ఎన్నో అడుగుల ఎత్తులో అద్భుతంగా ఉంటాయ్. కైలాసగిరి నుంచి విశాఖను చూస్తే నింగీనేలా కలుసుకున్నాయేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడి సీన్. ఇన్ని అద్భుత లొకేషన్స్‌ ఉండే వైజాగ్‌ సిటీలో ఇప్పుడిప్పుడే సినీ షూటింగ్స్ ఊపందుకుంటున్నాయి. కరోనా తర్వాత అందరి చూపూ విశాఖపై పడిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఒక కంప్లీట్ పిక్చర్‌ను అతితక్కువ ఖర్చుతో తక్కువ టైమ్‌లో వైజాగ్‌లో తీయొచ్చని చెప్పారు సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్.

ప్రకృతి రమణీయతకు నెలవైన వైజాగ్‌కు బంగారు భవిష్యత్ ఉందంటున్నారు సినిమా వాళ్లు. లాస్ ఏంజెల్స్ మాదిరిగా వైజాగ్ కూడా సినీ లోకానికి ఒక డెస్టినీగా మారబోతోందని చెబుతున్నారు.

వైజాగ్ అందాలు
ఒకవైపు అరకు అందాలు, అడవులు..
మరోవైపు ఊటీని తలపించే లంబసింగి..
ఇంకోవైపు చింతపల్లి, పాడేరు ఏజెన్సీలు..
ముంబై, చెన్నై కంటే అందమైన బీచ్‌లు…
పచ్చని ప్రశాంత వాతావరణం విశాఖ సొంతం…
ట్రాఫిక్ ప్రీ సిటీ, సుందరమైన సాగర తీరం…
నీలి సముద్రం…
రిసార్టులు, స్పీడ్ బోట్స్, విండ్ సర్ఫింగ్…
విశాఖ పోర్ట్..
భీమిలి దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్…

Also Read: బట్టలకొట్టు పాండురంగయ్య.. ఏకంగా 90 కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టాడు.. ఎంతమంది బలయ్యారో తెలిస్తే షాకే

 ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ అమలుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్.. ఆ రోజే మహిళల ఖాతాల్లో నగదు జమ