Andhra Pradesh: ఒక్కసారిగా చెరువులో మృతి చెందిన చేపలు.. ఆ పాపం ఎవరిదంటే?
విశాఖ జిల్లా పరవాడ మండలం పెద్దచెరువులో కలకలం రేగింది. ఒక్కసారిగా వేలాదిగా చేపలు మృతి చెంది నీటిపై తెలియాడడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.
Visakhapatnam News: విశాఖ జిల్లా పరవాడ మండలం పెద్దచెరువులో కలకలం రేగింది. ఒక్కసారిగా వేలాదిగా చేపలు మృతి చెంది నీటిపై తెలియాడడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. పరవాడ ఫార్మా వ్యర్ధ విషరసాయనాలు కలవడం వల్లనే చేపలు మృతి చెందినట్లు నిర్దారణకు వచ్చారు అధికారులు. దీంతో చేపల పెంపకందారులు లబోదిబో అంటున్నారు. ఇలా చేపలు ఇలా మృతిచెందడం ఇదే తొలిసారి కాదు. పరవాడలో భూగర్భ జలాలు మొత్తం ఫార్మా వ్యర్థాలతో కలుషితమవుతున్నాయి. గతంలో కూడా ఇలానే ఫార్మా వ్యర్ధాలు వలన చేపలు మృతి చెందాయి. దీంతో గతంలో ఆయుకట్టుదారులు పెద్దచెరువు దగ్గర తొమ్మిదిరోజులు నిరసన దీక్ష కూడా నిర్వహించారు. ఆ సమయంలో స్థానిక నాయకులు రైతులకు మద్దతు పలికి తూతూమంత్రంగా ఫార్మా యాజమాన్యాలను రప్పించి చెరువుల సుందరీకరణకు, రైతులకు నష్టపరిహారం వంటి మోసపూరిత హామీలు ఇప్పించి దీక్ష విరమింపజేసారు అని చేపల పెంపకం దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాని నాటి నుంచి నేటి వరకు రైతులకు ఎటువంటి నష్ట పరిహారం అందలేదని, పెద్ద చెరువు, ఊర చెరువుల సుందరీకరణ జరగలేదని రైతులు మండిపడుతున్నారు.
ఫార్మా యాజమాన్యాల నిర్లక్ష్యధోరణి రైతులపాలిట శాపంగా మారుతున్నాయని, ఇప్పటికే లక్షలో నష్టాలు వచ్చి చేపల పెంపకందారులు గగ్గోలుపెడుతున్నారు.ఇప్పటికైనా స్థానిక నాయకులు ఫార్మా యాజమాన్యాలు ఇచ్చిన మాట ప్రకారం చెరువులోకి ఫార్మా వ్యర్ధాలను రాకుండా చేసి చెరువులను సుందరీకరణ,రైతులకు నష్ట పరిహారం ఇప్పించే విధంగా చొరవ చూపాలని పెద్దచెరువు ఆయుకట్టదారులు, ప్రజలు కోరుతున్నారు.
(ఈశ్వర్, టీవీ9 తెలుగు, విశాఖ జిల్లా)
Also Read..
ఏపీలోని పలు పెట్రోల్ బంకుల్లో భారీ మోసం.. లీటరు కొట్టిస్తే దాదాపు పావు లీటరు ఖతం
Telangana High Court: గణేషుడి నిమజ్జనానికి అనుమతివ్వండి.. హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్..