
తెలిసి తెలియని వయసులో.. క్షణికా వేశానికి లోనై బలవన్మరాలు చేసుకున్న ఘటనలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. అనుకున్నది సాధించలేదనో.. కోరుకున్నది తనకు దక్కలేదనో విలువైన ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకి మనస్తాపానికి గురై జీవితం విలువైనదని తెలుసుకోలేక పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ల బలవన్మరణాలు కన్న తల్లిదండ్రులను గర్భశోకాన్ని మిగుల్చుతున్నాయి.
విశాఖలో 14 ఏళ్ల బాలిక.. బలవన్మరణం అందరిని కలచివేసింది. అది కూడా చాలా చిన్న విషయం. తల్లి ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం మాత్రమే చేసింది. కానీ ఆ బాలిక.. తల్లి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోక మనస్థాపానికి కూడా ప్రాణాలు విడిచింది. విషాదకర ఘటన విశాఖలోని ఎంవీపీ కాలనీలో జరిగింది.
పాత వెంకోజి పాలానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. పేద కుటుంబం.. తండ్రి టైల్స్ వర్క్ చేస్తుంటాడు. అమ్మమ తాత ఎంవిపి కాలనీలో అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా ఉన్నారు. తాత అమ్మమ్మ సొంతూరు వెళ్లడంతో అక్కడకు బాలిక ఆమె కుటుంబం వెళ్లి కొంటున్నారు. అయితే సంక్రాంతికి తనకు చీర కొనాలని తల్లిని కోరింది బాలిక. అప్పట్నుంచి చీర ఎందుకు హాఫ్ సారీ తీసుకోవాలని సూచించింది తల్లి. అది నచ్చని బాలిక తల్లితో వాగ్వాదానికి దిగింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలిక వాచ్మెన్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె కనిపించకపోవడంతో తన పెద్ద కూతురుని పంపించి పిలవాలని కోరింది తల్లి. ఎంత పిలిచినా తలిపి తీయకపోవడంతో ఒకటికి లోంచి చూశారు.. దీంతో ఆ బాలిక మిగతాజీవిగా లోపల కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో.. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. క్షణికావేశంలో కూతురు చేసిన పనికి ఆ కుటుంబం అంతా ఇప్పుడు తలడిల్లిపోతుంది. తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన తెలిసిన వారందరినీ కలచివేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..