పుట్టినకాన్నుంచి ఒకసారే అన్నం తిన్న బాలిక

| Edited By:

Feb 19, 2019 | 7:09 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఓ బాలిక తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. నాగేంద్ర అనే బాలిక పుట్టినప్పటి నుంచీ ఒకసారే అన్నం తీసుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అన్నప్రాసన టైమ్ లో అన్నం తినేందుకు నిరాకరించిన నాగేంద్రకు బలవంతంగా అన్నం తినిపించారు. అంతే వెంటనే వాంతులు అయి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో అప్పటి నుంచి అన్నం పెట్టడం మానేశారు. చిన్నప్పటినుంచీ అన్నం తినడం మానేసింది నాగేంద్ర. కేవలం దుకాణాల్లో దొరికే కుర్ కురే, […]

పుట్టినకాన్నుంచి ఒకసారే అన్నం తిన్న బాలిక
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఓ బాలిక తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. నాగేంద్ర అనే బాలిక పుట్టినప్పటి నుంచీ ఒకసారే అన్నం తీసుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అన్నప్రాసన టైమ్ లో అన్నం తినేందుకు నిరాకరించిన నాగేంద్రకు బలవంతంగా అన్నం తినిపించారు. అంతే వెంటనే వాంతులు అయి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో అప్పటి నుంచి అన్నం పెట్టడం మానేశారు. చిన్నప్పటినుంచీ అన్నం తినడం మానేసింది నాగేంద్ర. కేవలం దుకాణాల్లో దొరికే కుర్ కురే, చిప్స్, కారప్పూస, మిక్చర్ లనే ఆహారంగా తీసుకుంటుంది. ఇప్పుడు 13 ఏళ్ల వయసొచ్చినా చిరుతిళ్లనే తింటుంది. ప్రస్తుతం నాగేంద్ర ఏడో తరగతి చదువుతోంది. అన్నం తినకపోయినా.. బాలిక మాత్రం అందరి పిల్లల్లా హుషారుగానే ఉంటోంది. కాగా.. అన్ని వేళల్లోనూ ఆమె ఆహారంగా చిప్స్ నే తీసుకుంటుంది. అయినా.. మ్యాథ్స్ లో అందరికంటే ఎక్కువ ప్రతిభ కనబరుస్తుందంటూ ఉపాధ్యాయులు అంటున్నారు. ఆట, పాటల్లోనూ ఆమెనే నెంబర్ 1. తమకు నాగేంద్రను ఆస్పత్రిలో చూపించే స్థోమత కూడా లేదని తల్లిదండ్రులు అంటున్నారు.