YS Jagan Rendella Vidvamsam : వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రేండేళ్లు పూర్తయిందని, గత రెండేళ్ల పాలనలో జగన్ సర్కారు రాష్ట్రానికి చేసిందేమీ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీబీ, ఏసీబీ, పీసీబీ, సీఐడీ పాలన సాగుతోందన్నారు. జేసీబీతో కూల్చడం, ప్రశ్నించిన వారిపై ఏసీబీ కేసులు పెట్టడం, కుదరక పోతే పీసీబీని రంగంలోకి దింపుతున్నారని అచ్చెన్న ఆరోపించారు. సీఎం జగన్ ఏది చెప్తే సీఐడీ అదే చేస్తుందని విమర్శించారు. రాష్ట్రం పతనమైపోతోందని, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. ఈ రెండేళ్లలో జగన్ చేసిన పాలనపై ‘జగన్ విధ్వంసం అనే చార్జ్‌షీట్’ను ఆయన విశాఖపట్నంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్రలో కెక్కారన్నారు. జగన్ రెండేళ్ల విధ్వంసంపై చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ డమ్మీలేనని అచ్చెన్నాయుడు విమర్శించారు.
రెండేళ్ల జగన్ రెడ్డి పాలనని ఏసీబీ, జేసీబీ, పీసీబీ పాలనగా తెలుగుదేశం నామకరణం చేసింది. – @katchannaidu #JaganDestroyedAPin2Years pic.twitter.com/WFx8KffIxZ
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) May 30, 2021