నీపై అందుకే దాడి జరిగింది.. అక్బరుద్దీన్‌పై తలసాని సాయి కామెంట్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి మధ్య మాటలయుద్ధం తీవ్రతరమైంది. సికింద్రాబాద్‌ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే..ఒకసారి గెలిస్తే.. రెండుసార్లు ఓడతారంటూ.. తలసాని శ్రీనివాస్‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా.. కనీసం ఆయన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారంటూ ఇటీవల ఓ సభలో ప్రసంగించారు. దీనిపై ఘాటుగా స్పందించారు తలసాని సాయికుమార్‌ యాదవ్‌. గతంలో బుల్లెట్‌ దెబ్బలు తిని, కత్తిపోట్లకు గురైన నువ్వు.. దేశంకోసం ఏం త్యాగం చేయలేదంటూ ఫైర్ […]

నీపై అందుకే దాడి జరిగింది.. అక్బరుద్దీన్‌పై తలసాని సాయి కామెంట్

Edited By:

Updated on: Jan 23, 2020 | 1:14 PM

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి మధ్య మాటలయుద్ధం తీవ్రతరమైంది. సికింద్రాబాద్‌ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే..ఒకసారి గెలిస్తే.. రెండుసార్లు ఓడతారంటూ.. తలసాని శ్రీనివాస్‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా.. కనీసం ఆయన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారంటూ ఇటీవల ఓ సభలో ప్రసంగించారు. దీనిపై ఘాటుగా స్పందించారు తలసాని సాయికుమార్‌ యాదవ్‌. గతంలో బుల్లెట్‌ దెబ్బలు తిని, కత్తిపోట్లకు గురైన నువ్వు.. దేశంకోసం ఏం త్యాగం చేయలేదంటూ ఫైర్ అయ్యారు. పిచ్చి పిచ్చి వేశాలు వేయడం వల్లే నీపైన.. అప్పట్లో దాడి చేశారంటూ మండిపడ్డారు. మిత్రపక్షం మీద అనవసర వ్యాఖ్యలు చేయడం మంచిదికాదంటూ హెచ్చరించారు.