Son killed Father: క్షణికావేశం ఓ తండ్రి ప్రాణాలు తీసింది. ఆవేశంలో కొడుకు తోసేయాడంతో కిందపడిన తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) లోని అచ్యుతాపురం మండలం నారపాకలో చోటుచేసుకుంది. అప్పారావు అనే వ్యక్తి నారాపాకలో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గొర్రెలను మేతకు తీసుకెళ్లమంటూ కొడుకు రాజుకు చెప్పాడు. తండ్రి మాట వినక పోవడంతో కొడుకును అప్పారావు గద్దించాడు. దీంతో ఆగ్రహంతో ఉగిపోయిన రాజు.. కోపంతో తండ్రిపై దాడిచేశాడు. అంతేకాదు బలంగా వెనక్కు నెట్టాడు. దీంతో అప్పారావు తల ఇనుప బోరు గొట్టంపై పడింది. దీంతో అప్పారావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్.టి.ఆర్. హాస్పటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొడుకు చేసిన పనితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
– ఖాజా హుస్సేన్, టీవీ9 తెలుగు రిపోర్టర్, విశాఖపట్నం
Also Read: