పదో తరగతి, ఇంటర్ మార్కులతో నేరుగా రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
సదరన్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 4,471 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్ తదితర ట్రేడుల్లో అవకాశాలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 27లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

రైల్వేలో అప్రెంటిస్ శిక్షణ పొందాలనుకునే యువతకు చెన్నైలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) తీపికబురు చెప్పింది. సదరన్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లు, యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ ట్రేడుల్లో మొత్తం 4,471 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 27, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్, పెయింటర్, వెల్డర్, మెషినిస్ట్, ఎంఎంవీ, టర్నర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, వైర్‌మ్యాన్, అడ్వాన్స్‌డ్ వెల్డర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్-సివిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, గ్యాస్ కట్టర్, ఎంఎంటీఎం తదితర ట్రేడుల్లో అప్రెంటిస్ అవకాశాలు ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
RRC సదరన్ రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూనిట్ల వారీగా ఖాళీలు ఇలా..
- క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్, పెరంబూర్ ఖాళీల సంఖ్య: 80
- సెంట్రల్ వర్క్‌షాప్, పొన్మలై ఖాళీల సంఖ్య: 43
- ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, పొదనూర్, కోయంబతూర్ ఖాళీల సంఖ్య: 20
- రైల్వే హాస్పిటల్, పెరంబూర్ ఖాళీల సంఖ్య: 20
- క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్ గ్రూప్ ఖాళీల సంఖ్య: 1528
- సెంట్రల్ వర్క్‌షాప్, పొన్మలై గ్రూప్ ఖాళీల సంఖ్య: 1292
- ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, పొదనూర్ గ్రూప్ ఖాళీల సంఖ్య: 1488
ఫ్రెషర్ కేటగిరీ అభ్యర్థులు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎక్స్-ఐటీఐ కేటగిరీకి దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ట్రేడులో ఐటీఐతో పాటు ఎస్‌సీవీటీ/ఎన్‌సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ట్రేడుకు సంబంధించిన విద్యార్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ నాటికి ఫ్రెషర్ అభ్యర్థుల వయసు 15 నుంచి 22 సంవత్సరాలు, ఎక్స్-ఐటీఐ/ఎంఎల్‌టీ అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 27, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో రూ.100 ఫీజు తప్పకుండా చెల్లించాలి. నిబంధనల ప్రకారం కొన్ని రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు ఆధారంగా జరుగుతుంది. అప్రెంటిస్ శిక్షణ సమయంలో అర్హతను బట్టి స్టైపెండ్ అందిస్తారు. ఫ్రెషర్స్ (10వ తరగతి)కు నెలకు రూ.8,200, ఫ్రెషర్స్ (12వ తరగతి) నెలకు రూ.9,600, ఎక్స్-ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.9,600 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. రైల్వేలో అప్రెంటిస్ శిక్షణ పొందాలనుకునే అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ముందుగానే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
RRC సదరన్ రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




