AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC: నేరుగా మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.. బస్సు ఇక మిస్సవ్వదు..

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి మీరు బస్టాండ్‌కు వెళ్లాల్సిన పని లేదు. నేరుగా మీ ఇంటి వద్దకే బస్సు వచ్చేస్తుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం విజయవాడ పరిధిలోని దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

APSRTC: నేరుగా మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.. బస్సు ఇక మిస్సవ్వదు..
Apsrtc
Venkatrao Lella
|

Updated on: Sep 01, 2026 | 4:27 PM

Share

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ ఊరట. మీరు బస్సు ఎక్కాలంటే ఇకపై మీ ఇంటి నుంచి బస్టాండ్ వరకు వెళ్లాల్సిన పని లేదు. నేరుగా మీ ఇంటికే వద్దకే బస్సు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. దీంతో బస్టాండ్‌ వరకు వెళ్లాల్సిన శ్రమ మీకు తప్పుతుంది. దీని వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. బస్సు మిస్సవుతుందనే టెన్షన్ కూడా మీకు ఇక ఉండదు. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువచేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఈ కొత్త తరహా నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్ ముందే బుక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకే బస్సు వస్తుంది. ఈ సదుపాయం పొందాలంటే కొన్ని నిబంధనలను ఏపీఎస్‌ఆర్టీసీ రూపొందించింది. మీ ఇంటి వద్దకే బస్సు రావాలంటే ఏం చేయాలి..? విధివిధానాలు ఏంటి? ఎవరిని సంప్రదించాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కనీసం ఎంతమంది ప్రయాణికులు ఉండాలంటే..?

గ్రూప్ బుకింగ్స్‌కు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కుమంది ప్రయాణికులకు ఒకేసారి టికెట్ బుక్ చేస్తే ఇవి వర్తిస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకుని ఉండాలి. ఆరుగురు కంటే తక్కువమంది ఉంటే ఇది వర్తించదు. ఆరుగురు కంటే ఎక్కువమంది ఉంటే బస్సు ఇంటి వద్దకే వచ్చే పికప్ చేసుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ పరిధిలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో తొలుత అమలు చేయాలని నిర్ణయించారు. బస్సు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు 73828 25450, 99592 25450 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలి. దీంతో ఆర్టీసీ అధికారులు మీ ఇంటి వద్దకే బస్సు పంపుతారు. అయితే బస్సు ఎక్కాల్సిన ప్రాంతం నుంచి బస్టాండ్‌కు ఎంత దూరం ఉంటుంటో అంత ఛార్జీలు చెల్లించాలి. తొలుత విజయవాడ-హైదరాబాద్ రూట్లలో తిరిగే బస్సుల్లో దీనిని అమలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.

విజయవాడ పరిధిలో ఇది విజయవంతం అయితే ఇతర నగరాల్లో కూడా ఈ సేవలు ప్రారంభించనున్నారు. దశలవారీగా అన్ని నగరాలకు దీనిని విస్తరించనున్నారు. దీని వల్ల బస్సుల్లో ఆక్సుపెన్సీ కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ వినూత్న నిర్ణయం సక్సెస్ అవుతుందా లేదా అనే దానిపై ఆర్టీసీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇది సక్సెస్ అయితే ఆర్టీసీ చరిత్రలో ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది.

Follow Us