AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే వారికి చేతికి డబ్బులు..

నిరుపేదలకు, ఆసరా కోరుకునే కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ కానుక ప్రకటించింది. ఏళ్ల తరబడి కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరీక్షణకు తెరదించుతూ.. అక్టోబర్ నుంచే కొత్త పింఛన్ల పంపిణీకి పచ్చజెండా ఊపింది. పండుగకు ముందే అర్హుల చేతికి సొమ్ము అందేలా వెరిఫికేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Telangana: ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే వారికి చేతికి డబ్బులు..
Telangana New Pensions 2026
Krishna S
|

Updated on: Sep 22, 2026 | 7:15 PM

Share

తెలంగాణలోని అర్హులైన నిరుపేదలకు, లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రానున్న పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ నెల నుంచే కొత్త పెన్షన్లను లబ్ధిదారులకు అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగకు ముందే అర్హుల చేతికి పెన్షన్ సొమ్ము అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న లక్షలాది మందికి భారీ ఊరట లభించనుంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులతో పాటు వివిధ వర్గాల నుంచి అందిన అర్జీల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. గడువులోగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయడానికి అవసరమైతే క్షేత్రస్థాయిలో అదనపు సిబ్బందిని నియమించుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.

ముఖ్యంగా సమాజంలో ఆదరణ కోల్పోయిన ఒంటరి మహిళలు, వితంతువుల కేటగిరీలకు ఈ దఫాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఏ ఒక్క అర్హురాలూ నిబంధనల పేరుతో నష్టపోకూడదని, వంద శాతం పారదర్శకంగా అర్హులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వృద్ధాప్య, వికలాంగ, చేనేత, గీత కార్మికులు తదితర వర్గాల పెన్షన్ అర్జీలను కూడా వేగంగా పరిశీలించి ఆమోద ముద్ర వేయనున్నారు.

పండుగ వేళ పేద కుటుంబాల ముఖాల్లో చిరునవ్వులు పూయించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్హుల ఎంపికలో ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా, కేవలం నిర్దేశిత నిబంధనలు, అర్హతల ఆధారంగానే లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేయాలని యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి. జిల్లా కలెక్టర్లు స్వయంగా మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, దసరా నాటికి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.

Follow Us
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...
5 నిమిషాల్లో రుచికరమైన కరకరలాడే వడ, ఉల్లి పకోడీలు.. భలే రుచి!
5 నిమిషాల్లో రుచికరమైన కరకరలాడే వడ, ఉల్లి పకోడీలు.. భలే రుచి!
వావ్.. ఇది కదా కావాల్సింది.. జియో, ఎయిర్‌టెల్, వీఐ యూజర్లకు..
వావ్.. ఇది కదా కావాల్సింది.. జియో, ఎయిర్‌టెల్, వీఐ యూజర్లకు..