AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చనిపోయిన సింబా పేరుతో లక్కీ డ్రా.. వినాయకుడి లడ్డూ ఆమెకే

సఫిల్‌గూడకు చెందిన లక్ష్మి తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ‘సింబా’ పేరుతో రూ.30 లక్కీ డ్రా టికెట్‌ తీసుకున్నారు. సింబా మృతి చెంది సరిగ్గా నెలరోజులు పూర్తైన సమయంలో.. వేలాది చీట్లలో సింబా పేరున్న చీటీనే విజేతగా ఎంపికైంది. దీంతో వినాయకుడి లడ్డూ లక్ష్మికి దక్కింది. ఈ ఘటనను సింబా తనకు అందించిన వినాయకుడి ఆశీర్వాదంగా భావిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

Hyderabad: చనిపోయిన సింబా పేరుతో లక్కీ డ్రా.. వినాయకుడి లడ్డూ ఆమెకే
Ganesh Laddu Lucky Draw
Ram Naramaneni
|

Updated on: Sep 22, 2026 | 5:22 PM

Share

వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ లక్కీ డ్రా ఓ కుటుంబానికి ఊహించని అనుభూతిని మిగిల్చింది. సఫిల్‌గూడకు చెందిన లక్ష్మి.. తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ‘సింబా’ పేరుతో తీసుకున్న లక్కీ డ్రా టికెట్‌ ఏకంగా విజేతగా నిలవడంతో ఆనందంతో పాటు భావోద్వేగానికి గురయ్యారు. లక్ష్మికి సింబా అంటే ఎంతో అభిమానం. కొంతకాలంగా ఆమె కుటుంబంలో ఓ సభ్యుడిలా ఉన్న సింబా.. నెల రోజుల క్రితం మృతి చెందింది. దీంతో దాని జ్ఞాపకాలు లక్ష్మిని వెంటాడుతూనే ఉన్నాయి. సింబా తమతో లేకపోయినా.. దాని జ్ఞాపకం మాత్రం తమ మధ్య ఉండాలనే భావనతో రూ.30 విలువైన లక్కీ డ్రా టికెట్‌ను సింబా పేరుతో తీసుకున్నారు. అయితే వందలాది టికెట్ల మధ్య నిర్వహించిన లక్కీ డ్రాలో ఊహించని అద్భుతం చోటుచేసుకుంది. నిర్వాహకులు తీసిన విజేత చీటీలో ‘సింబా’ పేరు ఉండటంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. సింబా పేరుతో తీసుకున్న టికెట్‌కే గణేశుడి లడ్డూ దక్కడం లక్ష్మికి మరింత ప్రత్యేకంగా అనిపించింది.

ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. సింబా మృతి చెంది సరిగ్గా నెల రోజులు పూర్తయిన సమయంలోనే ఈ లక్కీ డ్రా నిర్వహించారు. సింబా తమను విడిచి వెళ్లిన బాధలో ఉన్న లక్ష్మికి.. అదే సింబా పేరుతో వినాయకుడి లడ్డూ రావడం భావోద్వేగానికి గురిచేసింది. దీంతో ఈ ఘటనను ఆమె ఓ సాధారణ లక్కీ డ్రా ఫలితంగా కాకుండా.. సింబా తనకు అందించిన ఓ మధురమైన జ్ఞాపకంగా భావిస్తున్నారు. ‘సింబా మా కుటుంబంలో ఒక సభ్యుడిలా ఉండేది. అది ఇప్పుడు మా మధ్య లేకపోయినా.. దాని పేరు మాత్రం మా జీవితంలో ఎప్పటికీ ఉంటుంది. సింబా పేరుతో తీసుకున్న టికెట్‌కు వినాయకుడి లడ్డూ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది’ అని లక్ష్మి భావోద్వేగం వ్యక్తం చేశారు. తన పెంపుడు కుక్కను కోల్పోయిన బాధలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. సింబా వల్ల తనకు వినాయకుడి ఆశీర్వాదం లభించిందని లక్ష్మి నమ్ముతున్నారు. సాధారణంగా లక్కీ డ్రా అంటే అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రక్రియే అయినా.. లక్ష్మికి మాత్రం ఈ లడ్డూ వెనుక తనకు ఎంతో ప్రియమైన సింబా జ్ఞాపకం ముడిపడి ఉంది.

దీంతో సఫిల్‌గూడలో జరిగిన ఈ లడ్డూ లక్కీ డ్రా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వేలాది చీట్లలో ఓ పెంపుడు కుక్క పేరు విజేతగా రావడం మాత్రమే కాకుండా.. దాని యజమాని అదే పేరుతో టికెట్ తీసుకోవడం, సింబా మృతి చెంది నెల రోజులు పూర్తయిన సమయంలోనే ఈ ఘటన జరగడం లక్ష్మికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మిగిలిపోయింది.

Follow Us
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది