మానభంగ పర్వం: అటు అనంతపురం.. ఇటు తూర్పు గోదావరి

‘దిశ’ హత్యాచారంపై ఇంకా ఆగ్రహావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష వేయాలని దేశవ్యాప్తంగా అందరూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇదంతా ఓ వైపు జరుగుతున్నా.. మరోవైపు మదమెక్కిన మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. మహిళలపై అత్యాచారం చేస్తూ మరింత భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. తాజాగా ఏపీలో రెండు అత్యాచార ఘటనలు కలకలం సృష్టించాయి. అనంతపురం జిల్లాలో కట్టుకున్న భర్తే తన మిత్రులతో కలిసి భార్యను అత్యాచారం చేయగా.. తూర్పు గోదావరి జిల్లాలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:44 pm, Tue, 3 December 19
మానభంగ పర్వం: అటు అనంతపురం.. ఇటు తూర్పు గోదావరి

‘దిశ’ హత్యాచారంపై ఇంకా ఆగ్రహావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష వేయాలని దేశవ్యాప్తంగా అందరూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇదంతా ఓ వైపు జరుగుతున్నా.. మరోవైపు మదమెక్కిన మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. మహిళలపై అత్యాచారం చేస్తూ మరింత భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. తాజాగా ఏపీలో రెండు అత్యాచార ఘటనలు కలకలం సృష్టించాయి. అనంతపురం జిల్లాలో కట్టుకున్న భర్తే తన మిత్రులతో కలిసి భార్యను అత్యాచారం చేయగా.. తూర్పు గోదావరి జిల్లాలో 55ఏళ్ల మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి కిరాతకంగా హత్య చేశారు.

అనంతపురం జిల్లా కదిరికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి సొంత భార్యపై అఘాయిత్యం చేశాడు. మద్యం మత్తులో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి అతడి మిత్రులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే గతంలో ఓ బాలికను రేప్ చేసిన మల్లేష్.. ఇదివరకే జైలుకెళ్లి వచ్చాడు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా సొంత భార్యపైనే అఘాయిత్యానికి ఒడిగట్టడం అందరినీ కలిచివేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో 55ఏళ్ల మహిళపై హత్యాచారం చేశారు. సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని, మొత్తం ముగ్గురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతురాలి భర్త, కుమారుడు గతంలో చనిపోగా.. కుమార్తె హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది.