మరో అల్పపీడన ముప్పు.. తెలంగాణకు మూడు రోజులు భారీ వర్షాలు

|

Sep 17, 2020 | 4:58 PM

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన ఈశాన్య బంగాళాఖాతంలో...

మరో అల్పపీడన ముప్పు.. తెలంగాణకు మూడు రోజులు భారీ వర్షాలు
Follow us on

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. (Rain Alert In Telangana)

ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ బలహీనపడిందని.. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 2.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని అన్నారు. అలాగే 4.5 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తు మధ్య షీర్ జోన్ కొనసాగుతుండటంతో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read:

నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!