అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ప్రైవేటు టీచర్లు

ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయులు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అప్పటికే మొహరించిన పోలీసులు.. అప్రమత్తం అయ్యారు. గన్‌పార్క్‌ దగ్గర కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది...

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ప్రైవేటు టీచర్లు
Follow us

|

Updated on: Sep 16, 2020 | 5:39 PM

ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయులు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అప్పటికే మొహరించిన పోలీసులు.. అప్రమత్తం అయ్యారు. గన్‌పార్క్‌ దగ్గర కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీచర్లను అదుపులోకి తీసుకుని వ్యాన్‌లో ఎక్కించారు.

TPTF ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వాళ్లు అసెంబ్లీకి చేరుకున్నారు.  కరోనా, లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి వీధిన పడ్డ తమను ఆదుకోవాలంటూ ప్రైవేట్‌ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. TPTF రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నేతలను అరెస్టు చేసి నారాయణగూడ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22వ తేదీ నుంచి మూతపడ్డాయి. వీటిల్లో పనిచేసే వేలాదిమంది బోధన, బోధనేతల సిబ్బందికి కొన్ని పాఠశాలలు మార్చి నెల జీతాలు ఇవ్వగా, మరికొన్ని మార్చి 21వ తేదీ వరకు జీతాలు చెల్లించాయి. ఏప్రిల్‌ నెల నుంచి వీరు పని చేయకపోవడంతో జీతాలు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి.  దీంతో ఎంతో కాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను నిర్ద్వందంగా  ప్రైవేటు యాజమాన్యాలు తొలించాయి. ఉపాధ్యాయ  వృత్తినే నమ్ముకుని బతుకీడుస్తున్న చాలా మంది ప్రైవేటు పాఠశాల టీచర్లు రోడ్డున పడ్డారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..