Police Case on Anakapalli under-construction flyover: కాంట్రాక్టర్ అవినీతి.. నాసిరకం నిర్మాణ పనులతో పట్టపగలే ఫ్లైఓవర్ సైడ్ బీమ్ రెండు వాహనాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. దాదాపు ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తునకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 302 (2) రెడ్ విత్ 34 ఐపీసీ కింద దిలీప్ బిల్డ్ కాన్ యాజమాన్యంతో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇదిలావుంటే.. విశాఖపట్నంలోని సగం నిర్మించిన ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న సమయంలో మంగళవారం ఈ దారుణ ఘటన జరిగింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది ఈ ప్రమాదం. ఒక్కసారిగా ఫ్లైఓవర్‌లో ఉన్న భారీ సైడ్ బీమ్ కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న లారీ ట్యాంకర్‌తోపాటు.. పక్కనే వెళ్తున్న కారుపైనా పడింది. పడీ పడడంతోనే కారు ముందు సీట్లలో ఉన్న బాలుడితో సహా మరో వ్యక్తి చనిపోయారు. వెనక సీట్లో కూర్చున్న ముగ్గురు మహిళలు కారు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇక ట్యాంకర్ విషయంలోనూ అదే జరిగింది. ట్యాంకర్ మధ్యలో ఆ సైడ్ బీమ్ కుప్పకూలింది. ముందున్న క్యాబిన్‌కు సరిగ్గా వెనుక భాగంలో పడడంతో.. మరో ఇద్దరి ప్రాణాలు దక్కాయి. క్యాబిన్‌లో ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ప్రమాద సమయంలో పెద్దగా జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమదాం జరిగిన వెంటనే ధైర్యం చేసిన స్థానికులు.. సహాయక చర్యలు చేపట్టగారు. ఒకరిద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. ఇప్పటికే చీకటి పడడంతో సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెల్లవారే వరకు కొనసాగించారు. ప్రమాద సంఘటన కాంట్రాక్టర్ వైఫల్యంగా స్పష్టమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీస్ అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సంఘటన సమాచారం సీఎం జగన్మోహన్‌రెడ్డికి తెలిపామని, ఉన్నతాధికారులతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వంతెన భీమ్‌లు కూలిపోయిన సంఘటనలో కాంట్రాక్టర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని, తక్షణమే అతన్ని అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న అనకాపల్లిలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని వాపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాద సంఘటనలో మృతి చెందిన కుటుంబాల వారికి రూ.కోటి చొప్పున పరిహారాన్ని అందించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లను సస్పెండ్ చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం, అధికారులు అప్రమ త్తంగా వ్యవహరించాలని కోరారు.
Read Also… Nandamrui Abhay Ram: తండ్రి ఫేస్‌తో బాక్సింగ్ చేస్తున్న ఎన్టీఆర్ సన్… నెట్టింట వైరల్ వీడియో…