ఇల్లందులో గంజాయి గ్యాంగ్..

|

Jun 28, 2020 | 9:06 AM

భద్రాద్రికొత్తగూడెంజిల్లా ఇల్లందులో గంజాయి సేవిస్తున్న 16 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో గంజాయి సప్లై..

ఇల్లందులో గంజాయి గ్యాంగ్..
Follow us on

భద్రాద్రికొత్తగూడెంజిల్లా ఇల్లందులో గంజాయి సేవిస్తున్న 16 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో గంజాయి సప్లై చేస్తున్న జ్యోతి, లీల, ప్రవీన్‌లపై నిఘాపెట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఒడిషా నుండి గంజాయి తప్పించి ఇల్లందులో గుట్టుచప్పుడు కాకుండా యువతకు విక్రయిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 19 మందిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు యువకుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లల ప్రవర్తనపై దృష్టిపెట్టాలని చెప్పారు.