పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదల: మంత్రి కేటీఆర్

తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వార్షిక ప్రగతి నివేదికను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. వార్షిక నివేదికలోని ప్రగతికి సంబంధించిన పలు వివరాలను మంత్రి వివరించారు. పట్టణాలన్నింటిని ప్రజలు జీవించేందుకు అనుకూలంగా లివబుల్ మరియు లవబుల్ సిటీలుగా మార్చాలన్నా బృహత్తరమైన, దీర్ఘకాలిక లక్ష్యంతో తెలంగాణ పురపాలక శాఖ పని చేస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు.

పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదల: మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Jun 24, 2020 | 4:54 PM

తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వార్షిక ప్రగతి నివేదిక(2019-20)ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్షిక నివేదికలోని ప్రగతికి సంబంధించిన పలు వివరాలను మంత్రి వివరించారు. ప్రగతి నివేదిక లోని కీలకమైన అంశాలు…

నూతన పురపాలక చట్టం 2019: తెలంగాణ మున్సిపల్‌ యాక్ట్‌ 2019 పేరుతో ఈ ఏడాది నూతన మున్సిపల్‌ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని పురపాలికల్లో సమగ్రమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 139 పట్టణ స్థానిక సంస్థలకు ఈ చట్టం వర్తింపు. నూతన మున్సిపల్‌ చట్టం భారతదేశంలోనే ప్రగతిశీల చట్టంగా నిలిచిందన్నారు.

నూతన పురపాలికల ఏర్పాటు: తెలంగాణలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పరిపాలనను మరింతగా వికేంద్రీకరించే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక నూతన పురపాలికలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాత మునిసిపాలిటీలతో పాటు, నూతన కార్పోరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఉన్న 78 స్థానిక సంస్థల సంఖ్యను 139కి పెంచినట్లు వెల్లడించారు. ఇందులో 13 నూతన మున్సిపల్ కార్పొరేషన్ లు కూడా ఉన్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లతో పాటు అన్ని మున్సిపాలీటీలకు 2020 జనవరిలో పురపాలక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.

పురపాలక పట్టణాలకు ప్రత్యేక నిధుల అండ: నూతనంగా ఏర్పాటు చేసిన పురపాలక పట్టణాలతోపాటు గతంలో ఉన్న పట్టణ స్థానిక సంస్థలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా టియూయప్ ఐడిసి సంస్థ ద్వారా 110 పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన పనులకు పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పట్టణాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం ఇదే మొదటిసారిగా పేర్కొన్నారు. ఈ నిధులను నేరుగా అభివృద్ధి కార్యక్రమాలపై ఉపయోగించాలని పురపాలక శాఖ నిర్దేశించడం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

పట్టణ రోడ్లకు మహర్దశ: పురపాలక శాఖ తన పరిధిలోని పట్టణాల్లో రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టిందన్నారు. పురపాలక శాఖ హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. నగరంలో 690 మేర రోడ్లను ఆరు ప్రధాన ఏజెన్సీలకు నిర్వహణ అప్పజెప్పింది. ఇంత పెద్ద ఎత్తున దీర్ఘకాలిక నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పడం దేశంలోనే మొదటి సారి. దీంతోపాటు నగరంలో ప్రధానమైన మార్గాన్ని రద్దీ రహితంగా మార్చేందుకు మిస్సింగ్ రోడ్లు, స్లిప్ రోడ్లు, లింకు రోడ్ల అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు. 38 ప్రధాన రోడ్డు విస్తరణ పనులు జంక్షన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. హోర్డింగ్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను మార్చడం. ఇందుకోసం బస్‌ షెల్టర్లను, పబ్లిక్‌ టాయిలెట్లను వినియోగించడం. కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం, ఎంజే మార్కెట్‌ ఆధునీకరణ, యుద్ధప్రాతిపదికన ఫ్లై ఓవర్ల నిర్మాణం, మెట్రో ప్రతిపాదిత మూడు మార్గాల్లో రవాణా సదుపాయాలను అందుబాటులోకి తేవడం వంటి ఇతర చర్యలను చేపట్టనున్నారు.

టీఎస్ బీ పాస్:

ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండిఏ లాంటి చోట్ల డీపీఎమ్ఎస్ విధానంలో ఇస్తున్న బిల్డింగ్ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పురపాలక పట్టణాల్లో ఆన్‌లైన్ ద్వారా బిల్డింగ్ అనుమతులు అందించే ప్రక్రియ తెలంగాణ పురపాలక శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ కెబినెట్ తుది ఆమోదం తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని పురపాలక శాఖ తెలిపింది.

టీడీఆర్ పాలసీ: టీడీఆర్ పాలసీకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా జీహెచ్ఎంసీలోని రోడ్డు విస్తరణ మరియు ఇతర అభివృద్ధి పనులకు కావలసిన ఆస్దుల సేకరణ మరింత తేలిక అయింది. ఈ కార్యక్రమం వలన స్థానిక సంస్థల పైన ఆర్థిక భారం పడకపోవడంతో ఆస్తుల సేకరణ మరింత సులభం అయింది. ఇప్పటిదాకా 2019- 20 సంవత్సరానికి 250 కోట్ల విలువైన టీడీఆర్ సర్టిఫికెట్ల అమ్మకం జరిగింది. పౌరులు తాము తీసుకున్న సర్టిఫికెట్ల కొనుగోలుకు సంబంధించి ఒక టీడీఆర్ ప్లాన్‌ను ఆన్‌లైన్ బ్యాంకును పురపాలక శాఖ ఏర్పాటు చేసింది.

మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి: ప్రపంచంలోనే పొడవైన పీపీపీ మెట్రో రైల్ ప్రాజెక్టు హైదరాబాద్‌‌లో 69 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌ నగరమే అతి పెద్ద మెట్రో రైలు కనెక్టివిటీని కలిగిఉంది. 2020 ఫిబ్రవరి నాటికి సుమారు 4 లక్షల మంది రోజువారీగా ప్రయాణం చేస్తూ రద్దీ అయినా మెట్రోల్లో హైదరాబాద్ మెట్రో ఒకటిగా నిలిచిందన్నారు.

పట్టణ పేదలకు బస్తీ దవాఖానా భరోసా: పట్టణ పేదలకు బస్తీ దవాఖానాల ద్వారా ఆరోగ్యాన్ని అందించేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 123 బస్తీ దవాఖానాల ఏర్పాటు. వీటితో పాటు మరో 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. 2020-21 ఏడాదిలో నగరంలో మొత్తం 350 బస్తీ దవాఖానాల ఏర్పాటు లక్ష్యంగా వెల్లడించారు.

పట్టణ ప్రజల దాహార్తి తీర్చిన పురపాలక శాఖ: పట్టణాల్లో తాగునీటికి ఆటంకాలు లేకుండా మంచినీటి సరఫరా చేసినట్టు పురపాలక శాఖ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి జలమండలి ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల గృహాలకు నీటి సరఫరా చేస్తుందని తెలిపారు. ఇదే జలమండలి 24 పట్టణ స్థానిక సంస్థలను, పద్దెనిమిది గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ లోపల 725 కోట్ల రూపాయలతో తాగునీటి సరఫరా ప్రాజెక్టును పూర్తి చేసింది. హైదరాబాద్‌ ప్రజల అవసరార్థం 20 టీఎంసీల సామర్థ్యంతో కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం మొదలు పెట్టినట్లుగా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో అర్భన్ మిషన్ భగీరధ కార్యక్రమాలు జోరుగా కోనసాగుతున్నాయి.

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్: డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా కోవిడ్ సంక్షోభం సందర్భంగా మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేసింది. తన సిబ్బందికి ప్రత్యేకమైన శిక్షణ తోపాటు, ప్రత్యేకమైన వాహనాలను సమకూర్చుకున్నజీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పింది. ఈ విభాగం చేపట్టిన కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. పుట్ పాత్ ఆక్రమణల తొలగింపు, పార్కులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, చెరువులను కాపాడుకోవడం వంటి అనేక కార్యక్రమాలను రెస్పాన్స్ ఫోర్స్ పెద్దఎత్తున చేపట్టింది.

కరోనా కట్టడిలో పురపాలక శాఖ పాత్ర: కరోనా సంక్షోభం నేపథ్యంలో పురపాలక శాఖ వైరస్ కట్టడి కోసం కీలక చర్యలు తీసుకుంది. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి మున్సిపల్ విభాగం పారిశుద్ధ్యం, విపత్తు సహాయక నిర్వహణ, నీటి సరఫరా వంటి అంశాల విషయంలో 24 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా పని చేసింది. సుమారు లక్షా 25 వేల మందికి ఉచిత భోజనాన్ని అందించింది. ముఖ్యంగా వలస కార్మికులకు సంబంధించి వారి వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇతర శాఖలతో పురపాలక శాఖ సమన్వయం చేసుకొని పని చేసింది. వలస కార్మికుల క్యాంపుల్లో కావాల్సిన కనీస వసతుల నిర్వహణకు దోహదం చేసింది. మరోవైపు ఈ సంక్షోభాన్ని అవకాశంగా వాడుకున్న పురపాలక శాఖ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేసింది. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ నగరంలో రోడ్ల ఆధునీకరణ చేపట్టడం వంటి తదితర అభివృద్ధి చర్యలను పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి సంస్థ చేపట్టింది.

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా