మరింత అప్రమత్తంగా ఉండండి: మంత్రి అనిల్ కుమార్‌

కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తుతుండగా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు

మరింత అప్రమత్తంగా ఉండండి: మంత్రి అనిల్ కుమార్‌

Edited By:

Updated on: Sep 27, 2020 | 4:48 PM

Minister Anil on floods: కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తుతుండగా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. రాత్రికి ప్రకాశం బ్యారేజీ వదల నీరు 6 లక్షల క్యూసెక్కులు వరకు వచ్చే అవకాశం ఉందని, అందుకే మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.

లోతట్టు,దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి.. వారికి పునారావాస చర్యలు తీసుకోవాలని అనిల్‌ ఆదేశించారు. ఇక కడప, కర్నూల్‌, అనంతపురం జిల్లాల ఇరిగేషన్ సీఈలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఆ మూడు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

Read More:

పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం..13 మంది సజీవదహనం

ఆ మూవీ స్ఫూర్తితోనే ‘నిశ్శబ్దం’ను రాశారట