Earthquake in AP: బాబోయ్.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి
ప్రకాశం జిల్లాలో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని క్షణ క్షణం భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు భూకంపం రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మరోమారు స్పల్ప భూకంపం వచ్చింది..
ముండ్లమూరు, డిసెంబర్ 23: ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. దీంతో వరుసగా మూడు రోజులు మూడు సార్లు ఆ జిల్లాలో భూకంపం వచ్చినట్లైంది. సోమవారం ముండ్లమూరులో స్వల్ప భూకంపం వచ్చింది. ఒక సెకన్ పాటు భూమి కంపించటంతో భయభ్రాంతులకు గురయిన గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుసగా మూడో రోజు భూకంపం రావటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం ముండ్లమూరు,శంకరాపురం గ్రామాల్లో భారీ శబ్ధంతో స్వల్ప భూకంపం వచ్చింది.