AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. భారీగా స్టైపండ్ పెంపు

రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులకు శుభవార్త అందించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల స్టైపండ్‌ను 10 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల స్టైపండ్‌ను 5 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వైద్య విద్యార్థులందరికీ ఏటా 3.5 శాతం స్టైపండ్ పెంపు వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది..

MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. భారీగా స్టైపండ్ పెంపు
Government Hikes Stipends For Medical Students
Srilakshmi C
|

Updated on: Sep 21, 2026 | 4:32 PM

Share

అమరావతి, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులకు శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్టైపండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులతో పాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు ఆర్థికంగా కొంత ప్రయోజనం కలగనుంది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల స్టైపండ్‌ను 10 శాతం పెంచనున్నారు. వైద్య విద్య సమయంలో విద్యార్థుల ఖర్చులకు ఈ పెంపు కొంత మేరకు ఉపశమనం కలిగించనుంది. అదేవిధంగా పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల స్టైపండ్‌ను 5 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఈ పెంపు వర్తించనుంది.

ఏటా 3.5 శాతం పెంపు

ఇకపై స్టైపండ్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వైద్య విద్యార్థులందరికీ ఏటా 3.5 శాతం స్టైపండ్ పెంపుదల వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వైద్య విద్యార్థులకు ప్రతి ఏడాది స్టైపండ్‌లో పెరుగుదల లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులకు ఆర్థికంగా ఉపయోగపడనుంది.

Follow Us