కనుమ రోజు ఆ అద్భుత బౌద్ధక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు.. చారిత్రాత్మక ప్రదేశం ఎక్కడో తెలుసా..?

| Edited By: Jyothi Gadda

Jan 16, 2024 | 5:58 PM

బుద్ధుని కొండ కాలక్రమేణా బొజ్జన్న కొండగా ప్రసిద్ధి చెందింది. అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతం నిలిచింది. బుద్ధిష్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కనుమనాడు ఇక్కడ తీర్థ మహోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. గత దశాబ్ద కాలం నుంచి బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా.. ఈ ప్రాంతం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. బౌద్ధారామ ప్రచారం చేపట్టింది. ఈ ప్రాంత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. ఈనెల 18న బౌద్ధ రామం నుండి ..

కనుమ రోజు ఆ అద్భుత బౌద్ధక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు.. చారిత్రాత్మక ప్రదేశం ఎక్కడో తెలుసా..?
Bojjannakonda In Anakapalle
Follow us on

విశాఖపట్నం, జనవరి 16; ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు, ప్రాంతాలు తనకంటూ విభిన్న ప్రాచుర్యం కలిగి ఉంటాయి. కొన్ని ప్రదేశాలు చారిత్రాత్మక విశేషాలను కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి.. మరికొన్ని ప్రాంతాలు వినోదాన్ని పంచుతాయి .. ఇంకొన్ని ప్రదేశాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఆధ్యాత్మికతను పంచే ప్రదేశాలు కూడా ఉన్నాయి.. కానీ.. ప్రాచీన బౌద్ధ శిల్పకళా సంస్కృతి పెంపొందించే చారిత్రాత్మక ప్రదేశంలో.. ఇప్పటికీ తీర్థ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అది కూడా కనుమనాడు జరిగే ఈ ఉత్సవానికి భారీగా జనం హాజరవుతూ ఉంటారు. బౌద్ధ బిక్షులు వచ్చి తొలి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ..

– అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో ఉంది బొజ్జన్నకొండ. ఈ కొండ పై వందల ఏళ్ల నాటి బౌద్ధారామం కొలువై ఉంది. అక్కడి బౌద్ధ స్థూపాలు, బుద్ధుని శిలా విగ్రహాలతో కూడిన ఈ ప్రాంతం బౌద్ధ క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. అంతే కాదు.. ప్రాచీన బౌద్ధ శిల్పకళా సంస్కృతి ఇక్కడ సాక్షాత్కరిస్తుంది.

– రాతితో ఆరు గుహాలయాల సముదాయమే ఈ బొజ్జన్న కొండ. క్రీస్తు శకం 4వ శతాబ్ధం కాలంలో బౌద్ధం ఇక్కడ విశేషంగా విరాజిల్లిందని అంటుంటారు. ఇక్కడి రాతిపై చెక్కబడిన గౌతమ బుద్ధుని విగ్రహాలు ఆకర్షణీయంగా, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి. ఈ గుహాలయాలకు దగ్గర్లోనే బౌద్ధ భిక్షవులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన స్థూపాలు దర్శనమిస్తాయి. ఈ ప్రాంతం జాతీయ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఏటా కనుమ రోజు తీర్ధ మహోత్సవం..

– బుద్ధుని కొండ కాలక్రమేణా బొజ్జన్న కొండగా ప్రసిద్ధి చెందింది. అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతం నిలిచింది. బుద్ధిష్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కనుమనాడు ఇక్కడ తీర్థ మహోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ బిక్షకులు చేరుకుని తొలి ప్రార్ధనలు చేస్తారు. ఆ తర్వాత ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ సారి కూడా నాగపూర్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బౌద్ధ భిక్షువులు చేరుకొని బొజ్జన్న కొండపై ప్రార్థనలు చేశారు. బౌద్ధమేళా ఘనంగా నిర్వహించ్చారు. బొజ్జన్న కొండ తీర్థ మహోత్సవానికి భారీగా హాజరయ్యారు జనం. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి హాజరయ్యారు.

బొజ్జన్న కొండ మరింత అభివృద్ధి..

– గత దశాబ్ద కాలం నుంచి బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా.. ఈ ప్రాంతం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. బౌద్ధారామ ప్రచారం చేస్తూ ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. ఈనెల 18న బౌద్ధ రామం నుండి అనకాపల్లి – ఆనందపురం జాతీయ రహదారికి కోటిన్నర నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్డు ప్రారంభం కానుంది. ఎంపీ బీసెట్టి సత్యవతి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడున్నర కోట్ల నిధులు విడుదల చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది కాక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో బొజ్జన్న కొండకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..