
విశాఖలో స్కూబా డైవర్లు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. 76 ఏళ్ల గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను సముద్ర గర్భంలో ఆవిష్కరించారు. జాతీయ జెండా నీటిలో రెపరెపలాడింది. నేవీ మాజీ సైబ్ మెరైనర్, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు. ఋషికొండ బీచ్ వద్ద సముద్రంలో డైవ్ చేసి దేశభక్తిని చాటారు. ధైర్యం అంకితభావంతో అద్భుతమైన ప్రదర్శన చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
సగర్వంగ జాతీయ జెండాను 45 నిమిషాల పాటు నీటిలో రెపరెపలాడించి దేశభక్తిని చాటారు. గణతంత్ర దినోత్సవ వేళ దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి సముద్రాన్ని, జీవరాసులను కాపాడాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా అడ్వెంచర్ టూరిజనుని ప్రోత్సహిస్తూ ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో బలరాం నాయుడు తో పాటు.. ఆనంద్, సతీష్, నరేష్, రాజు పాల్గొన్నారు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 78 అడుగుల లోతు సముద్ర గర్భంలో మువ్వనల జెండాతో దాదాపుగా అరగంట పాటు ప్రదర్శన చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..