అక్కడ డీజీపీ పర్యటన..ఏం జరగనుంది ?

కొమురం భీమ్ ఆసిఫాబాద్ లో డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణతో సమావేశం అయ్యారు.

అక్కడ డీజీపీ పర్యటన..ఏం జరగనుంది ?
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2020 | 2:28 PM

కొమురం భీమ్ ఆసిఫాబాద్ లో డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణతో సమావేశం అయ్యారు. ఓ వైపు గణపతి లొంగిపోతున్నారన్న వార్తలు మరో వైపు ఆసిపాబాద్ జిల్లాలో మావోల అలజడి కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, మావోయిస్ట్ కీలక నేత అడెళ్లు అలియాస్ బాస్కర్ డైరీ నేపథ్యంలో డీజీపీ పర్యటన కీలకంగా మారింది. బాస్కర్ డైరీలో కొందరు ఆదివాసీ నాయకుల పేర్లు తెరపైకి రావడం.. తాజాగా వారి పేర్లను‌ ప్రకటించడ‌ంతో ఆదివాసీల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో డీజీపీ పర్యటన మరింత ఆసక్తిగా మారింది. డీజీపీ పర్యటనతో జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు‌చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.