AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి మాధవీలతకు ఎక్సైజ్ శాఖ కౌంటర్ !

టాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ పార్టీల్లో డ్రగ్స్‌ వాడకం కామన్‌ అంటూ సంచలన కామెంట్స్ చేసిన మాధవీలతకు ఎక్సైజ్ శాఖ కౌంటర్ ఇచ్చింది. ఆరోపణలు కాదు.. ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరింది. మొత్తంగా మాధవీలత కామెంట్స్‌తో టాలీవుడ్‌లో డ్రగ్స్‌పై మళ్లీ హాట్‌ హాట్‌గా చర్చ నడుస్తోంది.

నటి మాధవీలతకు ఎక్సైజ్ శాఖ కౌంటర్ !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 02, 2020 | 2:09 PM

Share

హీరో సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ అంశం కలకలం రేగింది. ఇప్పుడది టాలీవుడ్‌ను కూడా షేక్‌ చేస్తోంది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత కామెంట్సే దీనికి కారణం. టాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ పార్టీల్లో డ్రగ్స్‌ వాడకం కామన్‌ అంటూ మాధవీలత పెట్టిన పోస్ట్‌ కలకలం రేపింది. దీనిపై ఎన్‌సీబీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలంటూ ఆమె పోస్ట్‌ పెట్టారు. తాజాగా నటి కంగనా రనౌత్ కూడా బాలీవుడ్‌లో డ్రగ్స్ కల్చర్ ఉందని.. దాదాపు 90 శాతం అవి తీసుకోకుండా ఉండలేరని చేసిన కామెంట్స్‌పై ఎంత రచ్చ జరిగిందో ఇప్పుడు మాధవీలత చేసిన పోస్టుపై అంతకు మించే రచ్చ జరుగుతోంది.

తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మాధవీలత మరోసారి స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం తాను ఓ పార్టీ వెళ్లినప్పుడు కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ తీసుకోవడం చూశానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పట్లో భయంతో ఈ విషయాలను బయట పెట్టలేకపోయానని అన్నారు. ఎందుకంటే దీని వెనుక పెద్ద మాఫియాలు ఉంటాయని మాధవీలత తెలిపారు. ఇప్పటికే భయం ఉన్నా… బాధ్యతగల సిటిజన్‌గా ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి డ్రగ్స్‌ కల్చర్‌ను ప్రభుత్వమే అరికట్టాలని ఆమె కోరారు.

సంచలనం కోసం తాను మాట్లాడటం లేదన్న మాధవీలత.. గతంలో తెరపైకొచ్చిన డ్రగ్స్‌ కేసులు ఎందుకు బలహీనపడ్డాయని ప్రశ్నించారు. అన్నీ తెలిసి డ్రగ్స్‌ తీసుకునేవారు బాధితులు కాదు నేరస్తులేనని అన్నారు. ఇప్పటికైనా ఎన్‌సీబీ అధికారులు టాలీవుడ్‌పై దృష్టిసారించాలని ఆమె సూచించారు. ఇటు ప్రభుత్వానికి అటు అధికారులకు ఇదే తన ఓపెన్‌ లేటర్‌ అని అన్నారు.

నటి మాధవీలత చేసిన డ్రగ్స్ ఆరోపణలపై ఎక్సైజ్‌ పోలీసులు స్పందించారు. టాలీవుడ్‌ పార్టీల్లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని అన్నారు. అదే సమయంలో సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మరికొంత మంది తమ నిఘాలో ఉన్నారని ఎక్సైజ్‌ శాఖ పోలీసులు తెలిపారు. మొత్తంగా మాధవీలత కామెంట్స్‌తో టాలీవుడ్‌లో డ్రగ్స్‌పై మళ్లీ హాట్‌ హాట్‌గా చర్చ నడుస్తోంది.

Follow Us
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..