కరోనా వైరస్.. భక్తుల కోసం కాణిపాక దేవస్థానం కీలక నిర్ణయం..!

| Edited By:

Apr 13, 2020 | 9:20 PM

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రముఖ ఆలయాల్లోకి దేవాదాయశాఖ భక్తులను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని ఆలయాల్లో నిర్వహించే ప్రత్యేక పూజలు ఆగిపోయాయి.

కరోనా వైరస్.. భక్తుల కోసం కాణిపాక దేవస్థానం కీలక నిర్ణయం..!
Follow us on

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రముఖ ఆలయాల్లోకి దేవాదాయశాఖ భక్తులను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని ఆలయాల్లో నిర్వహించే ప్రత్యేక పూజలు ఆగిపోయాయి. ఈ క్రమంలో భక్తుల కోసం కాణిపాకం దేవస్థానం బంపరాఫర్ ప్రకటించింది. కాణిపాకం ఆలయంలో భక్తులు పరోక్షంగా పూజలు, మొక్కులు స్వామివారి సేవలు నిర్వహించుకునేలా అవకాశం ఇవ్వనుంది.

కరోనా మహమ్మారి రాక ముందు వరకు ప్రత్యక్షంగా సేవలో పాల్గొన్న భక్తులు నేటి నుంచి పరోక్షంగా వారి పేర్లతో పూజలు, హోమాలు నిర్వహించుకోవచ్చు. అంతేకాదు కాణిపాకం ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి జరిగే అభిషేకం, నిత్య కళ్యాణం, గణపతి హోమం, ప్రతి శనివారం జరిగే సుదర్శన హోమంతో పాటు పలు సేవలను పరోక్షంగా భక్తులు నిర్వహించుకోవచ్చు.  దేవస్థానానికి చెందిన బ్యాంకు ఖాతాలో ఆన్ లైన్ పేమెంట్ చేసి.. పేరు, గోత్రాలను ఈ మెయిల్ చేస్తే ఆయా భక్తుల పేర స్వామివారికి సేవలు చేస్తామని దేవస్థానం ఈఓ వెల్లడించారు.

Read This Story Also: షాకింగ్.. డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే కరోనా పాజిటివ్..!