ఏపీలో పెరిగిన కంటైన్‌మెంట్ జోన్లు.. మొత్తం ఎన్నంటే..!

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటిస్తూ వస్తున్నారు అధికారులు.

ఏపీలో పెరిగిన కంటైన్‌మెంట్ జోన్లు.. మొత్తం ఎన్నంటే..!

Edited By:

Updated on: Jul 17, 2020 | 10:02 AM

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటిస్తూ వస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్ల సంఖ్య తాజాగా 3,284కు చేరింది. వీటిలో అత్యధికంగా నెల్లూరు(396) జిల్లాలో ఉన్నాయి. అలాగే అనంతపురంలో 116, చిత్తూరులో 227, తూర్పు గోదావరిలో 335, గుంటూరులో 180 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. కాగా మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 38,044కి చేరింది. అలాగే మృతుల సంఖ్య 492 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 18,159 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, 19,393 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.