ఏపీలో 1,658 మంది ఖైదీలకు కరోనా.. కడప జైల్‌లో అత్యధిక కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతూనే ఉండగా.. మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలకు దగ్గర్లో ఉంది

ఏపీలో 1,658 మంది ఖైదీలకు కరోనా.. కడప జైల్‌లో అత్యధిక కేసులు

Edited By:

Updated on: Sep 18, 2020 | 6:53 AM

AP Prisoners Corona: ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతూనే ఉండగా.. మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలకు దగ్గర్లో ఉంది. ఇదిలా ఉంటే ఏపీలోని జైళ్లలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,658 మంది ఖైదీలకు కరోనా సోకింది. వీరిలో ఒకరు వైరస్‌తో మృతి చెందారు. కడప సెంట్రల్‌ జైళ్లో అత్యధికంగా 360 మంది ఖైదీలకు కరోనా సోకింది. వారిలో 349 మంది కోలుకున్నారు.  ఇక రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 383 మంది, నెల్లూరు సెంట్రల్ జైల్లో 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా, సబ్ జైళ్లలో కోవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది రిమాండు ఖైదీలు ఉన్నారు. ప్రస్తుతం అన్ని జైళ్లో 250 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

ఘనంగా ఎంగిలిపూవు బతుకమ్మ సంబురాలు

డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మోడల్ సంచలన ఆరోపణలు